సాహితి

పంజాగుట్ట బూరుగుచెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్సేన్‌సాగర్ జలాల మధ్య
నిలువెత్తు బోధిసత్వుడు నిలబడినట్టు
రణగొణ ధ్వనుల పంజాగుట్ట రద్దీ చౌరస్తాలో
హుందాగా నిలబడిందీ బూరుగుచెట్టు
దూరం నుండి చూస్తే సాదాసీదాగా కనిపించే ఈ చెట్టు
దాని మొదట్లో నిలబడి తలెత్తిచూస్తే
ఖలీఫా బురుజంత ఎత్తుగా దర్శనమిస్తుంది

ఆదిమనిషై పుట్టివుంటే దాని వయసు ఇంతనో అంతనో
లేదా శత వసంతాల వృక్షం అనో పత్రికలు కథనాలు రాసేవి
దాని కొమ్మలూ రెమ్మలూ ఉన్నతంగా ఊర్ధ్వముఖంగా
ఆకాశంలోకి ఎంత ఎత్తున మెడలు సాచాయో
దాని వేళ్లు భూగర్భంలోకి అంత లోతుకీ ప్రయాణించి వుంటాయి
లేకపోతే దశాబ్దాల కాలంగా కాంక్రీటు వనం లాంటి నగరంలో
అది పచ్చపచ్చగా ఎలా మనగలుగుతుంది?

మనిషి అడ్డంగా చేతులు చాచినట్టు
కాండం పొడవునా విస్తరించిన కొమ్మలు
ఇనే్నళ్లుగా ఎన్ని బూరుగు కాయలు కాచాయో!
ఎంత దూదిని పింజెలు పింజెలుగా గాలిలోకి ఎగరేసాయో!
ఇప్పుడు బూరుగదూది దిండ్ల స్థానంలో
యూఫోమ్ తలగడలొచ్చాయి కానీ
ఇదే చెట్టు ఏ పల్లెలోనో పుట్టి వుంటే
ఏడాదికి నాలుగిళ్లకు సరిపడా తలదిండ్లు యిచ్చేది
నగరంలో పుట్టి నిస్సంతుగా మిగిలిపోయింది గానీ
ఏ రేగడి నేలలోనో పుట్టి వుంటే
తన చుట్టూ పెద్ద బూరుగు వన సామ్రాజ్యానే్న నిర్మించుకునేది!
రోడ్ల డివైడర్ల మధ్య కృత్రిమంగా మొలిపించిన
పిచ్చి క్రోటన్సు మొక్కలకు
వారం వారం మొదలంటా నీళ్లు తలంటు స్నానాలు!
ఆపాదమస్తకమూ ధూళి దూసరితమైన ఈ బూరుగు చెట్టుకు మాత్రం
ఏ ఆకాశగంగో కరుణించి అకాలవర్షం కురిపించినప్పుడే అభ్యంగన స్నానం!
చెట్టును నరికితే శిక్షే అన్న ఏ మంచి చట్టమో
ఈ పట్నపు చెట్టును ఇన్నాళ్లు బతికించి ఉంటుంది
పుట్టుకతోనే భవిష్యత్తు ప్రమాదాన్ని ఊహించి
మెట్రో రైలు మార్కింగ్ చోటులో మొలవనందుకు
ఇది తనను తాను బ్రతికించుకుని వుంటుంది

భూగర్భ శాస్తవ్రేత్తలను పిలవండి
దీని వేళ్లు ఎంత వైశాల్యంలో విస్తరించాయో లెక్కతీస్తారు!
వృక్ష శాస్తజ్ఞ్రులను పిలవండి
ఈ వృక్షరాజం వయసు ఎంత అంచనా వేస్తారు
పక్షి శాస్తజ్ఞ్రులను పిలవండి
రాత్రి పూట జాషువాగారి గబ్బిలపు రాణులేమైనా
ఈ చెట్టుపైనా కాపురం చేస్తున్నాయేమో తేలుస్తారు
మురమళ్ల ఏడలరేవు మర్రిచెట్టైనా
పంజాగుట్ట బూరుగు చెట్టైనా ఒకటే!
అంతరాంతరాల్లో మనిషిని మనిషిని
కలిపి ముడివేసే కనబడని తల్లివేళ్లు!

- శిఖామణి, 9848202526