సాహితి
మా అమ్మ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 28 December 2015
అనువాదం: వి.కృష్ణ
మా అమ్మ ఎంతో శ్రమజీవి
ప్రేమానురాగాల గని
దయామయురాలు
ఆమె ముందు సముద్రం కూడ
చిన్నబోతుంది
ఆమె ముందు ఆకాశం కూడ
తలదించుకుంటుంది
నెమలి వచ్చి కూర్చున్నట్లుగా
మా అమ్మ ఇంటికొచ్చింది
విద్యాశక్తి
ప్రత్యక్ష స్వరూపిణిలా
నేనామెను గుండెలో దాచుకున్నాను
*
‘ పూలే కావ్య-సుబోధ్ రత్నాకర్’ మరాఠీ సంకలనం నుండి కవితల అనువాదం