సాహితి
సీతాకోక చిలుకలు - పూ మొగ్గలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగు రంగుల అందమైన
సీతాకోక చిలుకలు
మెరిసే కళ్ళు,
ఇంద్ర ధనుస్సు నువ్వు
దేహంపై పట్టుల్లాంటి రెక్కలు
చిన్న పెద్ద, ముడుచుకుని ఉండె
పసుపురంగు రెక్కలు
అయినా, ఆకాశంలోకి ఎగురుతాయి
వాటి రూపం రంగు మనోహరం
సీతాకోక చిలుకలను చూస్తూ చూస్తూ
నన్ను నేను మరచిపోయాను
పూ మొగ్గలు
కోమలం, అత్యంత సుందరం
ఆతురతతో సీతాకోక చిలుకలను
దగ్గరకు రమ్మంటాయి
వాటికోసం ఎదురుచూస్తాయి
పరుగెత్తుకుంటు రా! సీతాకోక చిలుక
మనస్సులోనే తలపిస్తాయి పూ మొగ్గలు
పూల చెంతకు
ఎగిరొస్తాయి సీతాకోక చిలుకలు
ఒకటై తేనేను త్రాగుతాయి
వాడి పోతాయి పూ మొగ్గలు
పూ మొగ్గల రసాస్వాదన చేశాక
మరొక చోటును వెతుకుంటు పోతాయి
ఇదే ప్రపంచ పోకడ
స్వార్థం, రెప్పపాటు సంబంధాలు
ప్రపంచ పోకడను చూసి
ఆశ్చర్యపోతాను
*
‘ పూలే కావ్య-సుబోధ్ రత్నాకర్’ మరాఠీ సంకలనం నుండి కవితల అనువాదం