సాహితి

24 X 7 రహదారి జీవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లుల గర్భాలు భూగోళాలు!
పిల్లలకి శరీరాల్ని పంచీ, శీలాల్ని పెంచీ శ్రమిస్తూనే ఉంటారు
జేబుల్లోని గుండెలు ఖాళీ అయిపోయేదాకా తల్లిదండ్రులు!
వాళ్ల రక్తంలో ‘రక్షాబంధం’ ప్రవహిస్తూనే ఉంటుంది!
ప్లాటుఫాం మీద రైళ్లకి పచ్చజెండాలూపినట్లు
నిరంతరం కళ్లల్లో జెండాలు ఆవిష్కరిస్తూనే ఉంటారు
క్షేమాల్ని ప్రసరింపజేస్తూనే ఉంటారు!
ఏ కొమ్మ మీది, ఏ నేలమీది గూటి నివాసమైనా
బువ్వ నింపుతునే ఉంటారు పిల్లల పొట్టల్లో!
తప్పిదాల్ని సరిదిద్దుతుంటారు
పైటలూ, తువ్వాళ్లూ సర్దుకున్నట్లు!
పిల్లల సుస్తీలకి తల్లుల కళ్లు జలపాతాలవుతూ
ఆసుపత్రుల ఆవరణల నిండా
‘హ్యాండు బ్యాగు’ల్లోని సాయి చాలీసాగానో, హనుమాన్ చాలీసాగానో
ప్రతిధ్వనిస్తుంటాయి వాళ్ల గొంతులు!
కన్నీళ్లతో పిల్లల కణజాలాల్ని నిర్మిస్తూ ఉంటారు తల్లిదండ్రులు!
ఊపిర్లనిండా క్షమాగుణాలే నిండి ఉంటాయి!
ఇంద్రియాయుధాల్ని జమ్మిచెట్టుమీద మూటగట్టి దాచినట్లు
అన్ని చేష్టలూ ఉడిగిన 24 తి 7 రాదారి గొడ్డు
నేటి తండ్రి!
తల్లిదండ్రుల స్థానాలు
దేవతామూర్తుల గద్దెలు!
కష్టజీవులారా కరుణించండని
వేడుకోవడం వినా అన్యమార్గం లేదు!
అబ్బా అమ్మల ఆకృతిని వికారం జేసే
సంస్కృతి రూపంలోని దాడికి
దీవెనలుండవు, దోవలుండవు!

- ఒబ్బిని