సాహితి

ఆ క్షణం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారణం ఏదయినా
ప్రాణం తీసుకొంటే ఎలా?
అనుకున్నవి సిద్ధిస్తే
ఆస్వాదించడమేనా?
అనుకోనివి సంభవించినా... స్వీకరించాలిగా!

విజయం అధిరోహించడమేకాదు
అపజయం అధిగమించడమూ తెలియాలి
జీవన గమనంలో
ఏ సమస్యా ముగింపు కాదు... మలుపు మాత్రమే
యిదే ముగింపు అని ఆగిపోతే
దారులన్నీ ఊపిరి ఆడనంత చిరాకులు.

వేటు పడితే ఓడిపోవడం కాదు
ఆగిపోవడం అంతకన్నా కాదు
గెలుపుకోసం పరుగెట్టడం
ఈసారైనా లక్ష్యాన్ని ఒడిసి పట్టుకోవడం
విశ్వవిజేతలంతా
ఓటమి సంకెళ్ళు ఛేదించుకున్నవాళ్ళే!!

ఏదో లేదనీ... యింకేదో కావాలనీ
అన్నీ ఉన్నవాడిదే ఆరాటం.
వికలాంగులది కేవలం అంగవైఫల్యం
మరినీదో... భావవైకల్యం

హత్య పాపమయితే
ఆత్మహత్య మహా పాపం
కన్నవారికి కడుపు శోకం రగిల్చి
నమ్ముకున్న వారికి నరకం మిగిల్చి
సాధించాల్సింది మధ్యలోనే వదిలేసి
పిరికిపందలా చరిత్రలో మిగిలిపోతే
జన్మకు సార్థకత ఏదీ?
చరిత్ర పుటల్లో నీకు చోటేదీ?

నాకు తెలుసు...
ఆ నిముషంలో నీకు కావలసింది ఓదార్పు
ఒక ఆత్మీయ సాంత్వనం
ఓ చల్లని పలుకు... నేనున్నానే భరోసా?
తెలియాల్సిందల్లా...
ఆ క్షణం దాటేస్తే
దారుణం ఆగేది.... మరణం తప్పుకునేది!!

- రమణ వెలమకన్ని, 9866015040