సాహితి

మొన్నటి కొన్ని దళిత కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవీయ విలువలు, నైతికత, ధర్మస్థాపన, త్యాగం ప్రేమ వంటి విషయాలపై దాదాపు అన్ని ప్రపంచ భాషలలో కథలొచ్చినట్టుగానే మన భారతీయ భాషలలో కొడా వచ్చాయి. ఇటీవలి కాలంలో స్ర్తివాదం, దళిత వాదం, విప్లవం, తిరుగుబాటు, ఉద్యమాలకు సంబంధించి భారతీయ భాషలన్నింటా కథలొచ్చాయి. జీవన విధానంలో ఆచార వ్యవహారాలలో కొద్దిపాటి తేడాలు కనిపించిన అంతస్సూత్రంగా సాగే ‘్భరతీయత’ మనకు అన్ని రచనల్లో కనిపిస్తుంది. వ్యవసాయం, రైతు సమస్యలు, ఆత్మహత్యలు, గని కార్మికుల జీవితం మీద తెలంగాణ, రాయలసీమ ప్రాంత రచయితలు కథా సాహిత్యం సృష్టించారు. వరదలు, ఉప్పెనలు, చేపల చెరువుల సమస్యలు మనకు కోస్తాంధ్ర కథల్లో కనిపిస్తాయి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ మొదలైన ప్రాంతాల్లోని తెలుగు రచయితలు ప్రవాసాంధ్రుల జీవన విధానం మీద వారి స్థితిగతుల మీద వారి ప్రత్యేక సమస్యల మీద తమ కలాల్ని ఎక్కుపెట్టారు. ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని తెలుగు రచయితలు కొద్దిగా రాసినా వారి ఖండాంతర అనుభవాల గురించి నమోదు చేశారు. మళ్లీ వీటన్నింటికీ అంతస్సూత్రం ఒక్కటే! తాము కోల్పోయిన మూలాలను అనే్వషించుకోవడమే. అందువల్ల కథను ఎక్కువమంది ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నారు. కళా ప్రక్రియగా దాన్ని తీర్చిదిద్దిన వారున్నా, వారి సంఖ్య చాలా స్వల్పం! మూలాధారమైన జీవితంలోంచి ఎవరి ఆలోచనా ధోరణిని వారు కథల రూపంలో ప్రదర్శించారు. జీవితంలో అన్నీ ఉన్నట్టుగానే కథా సాహిత్యంలో కూడా అన్నీ చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వైజ్ఞానిక అంశాల్ని, పర్యావరణ సమస్యల్ని, రూపుమార్చుకున్న శారీరక-మానసిక దోపిడుల్ని సరోగసి (అద్దెగర్భం) లాంటి వైద్య, ఆరోగ్య సంబంధమైన విషయాల్ని ఇముడ్చుకుని వస్తున్నాయి.
అయితే భాషా రచయితలందరు ప్రశ్నిస్తున్నది ఒక్కటే- ‘‘మనమెక్కడికి పోతున్నాం?’’ అని! నూతన ఆవిష్కరణల కోసం, పరిష్కారాల కోసం నవతరం ఆరాటపడుతున్న తీరు, ఇప్పుడొస్తున్న కొత్త కథలలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది!
ఈ రచయత అనువదించిన కొన్ని భారతీయ దళిత కథల్లోని పోలికలు, తేడాలు అవగతమవుతాయి. సి.రాజగోపాలాచారి తమిళ కథ ‘అంటరానివాడు’- శంకర్రావ్ ఖరత్ మరాఠీ కథ ‘బతుకుతున్న శవాలు’- కుం.వీరభద్రప్ప కన్నడ కథ ‘పరమాన్నం’- వీటితోపాటు మన తెలుగు రచయిత కాళోజీ నారాయణరావు కథ ‘తెలియక ప్రేమ-తెలిసి ద్వేషము’ గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇవన్నీ దళితుల జీవితాలపై వచ్చిన మంచి కథలు. బాహ్య జగత్తులోని కష్టాలనే కాక, అంతర్జగత్తులోని మనోవేదనను ఇవి చిత్రించాయి. వేరు వేరు భాషలలో రాయబడినవైనా వీటి అంతస్సూత్రం ఒక్కటే! సమాజంలో హీనంగా చూడబడ్డ దళితుల స్థాయి, దయనీయమైన వారి స్థితిగతులు ఈ భారతీయ రచయితలందరూ ఒకేవిధంగా చిత్రించారు.
భారత తొలి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి పేరు వినగానే ఇంగ్లీషులో మహాభారతచ, భగవద్గీత, ఉపనిషత్తులు గుర్తొస్తాయి. కాని వాటితోపాటు ఆయన, నాటి సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ సృజనాత్మక రచనలు చేసిన సంగతి కొద్దిమందికి తెలుసు. ‘అంటరానివాడు’ శీర్షికతో ఆయన తమిళంలో వెలువరించిన కథ, పరారుూకరణకు గురైన ఒక దళితుడి ఆత్మక్షోభను వర్ణించింది. ఇందులో కథా నాయకుడు అర్ధనారి. ఒక హరిజన బాలుడు. సేలం జిల్లా కొక్కాలై గ్రామ నివాసి. హరిజనోద్ధరణ సంఘం ప్రధాన కార్యాదర్శి మల్కానీ అనే ఆయన దక్షిణ భారత పర్యటనలో ఉండగా ఓరోజు సేలంలో అర్ధనారిని చూస్తాడు. కుర్రవాడి నడవడికి అబ్బురపడి వాడ్ని తనతోపాటు ఢిల్లీకి తీసుకుపోతాడు. చదువు చెప్పిస్తాడు. ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. కష్టపడి పనిచేసే అర్ధనారి త్వరితగతిన అధికారై బెంగుళూరుకు బదిలీ అవుతాడు. అక్కడతని పై అధికారి గోవింద రావు అప్పుడప్పుడే మాంచెస్టర్‌లో శిక్షణ పూర్తిచేసుకుని వస్తాడు. ఇద్దరు ఒకే వయసువారు కావడంవల్ల వారి మధ్య స్నేహం బలపడుతుంది. అలాగే గోవిందరావు చెల్లెలు పంకజంతో కూడా మన కథానాయకుడికి చనువు ఏర్పడుతుంది. తను పెరియవాణ్ణని చెప్పుకుంటే గౌరవం తగ్గిపోతుందేమోనని కోయంబత్తూర్ శైల మొదలియార్లమని అబద్ధం చెపుతాడు. అయితే ఆ క్షణంనుంచి న్యూనతా భావానికి గురి అవుతుంటాడు. గోవిందరావుగాని, అతని చెల్లెలు పంకజం కాని ఆ విషయమే పట్టించుకోరు. వారి దృష్టిలో కులానికి అసలు అర్ధమే లేదు. తన చెల్లెలిని అర్ధనారికిచ్చి పెళ్లి చేయాలని గోవిందరావు నిశ్చయించుకుంటాడు. అక్కడినుండి అర్ధనారిలో అంతర్మథనం ప్రారంభమవుతుంది. ఒకవైపు ఊళ్లో హరిజనవాడలోని అర్ధనారి కుటుంబం సభ్యులందరు కలరాతో చనిపోతారు. అందుకు కారం అర్ధనారి అలసత్వమే కనుక అతను మరింత కృంగిపోతాడు. తను ఒకప్పుడు తన కులం గురించి అబద్ధమాడానని, నిజానికి తను పెరియనని-అతి కష్టమీద చెప్పుకోలేక చెప్పుకుంటాడు. ఆ అన్నాచెల్లెళ్లిద్దరు ఆ విషయం తేలికగా తీసుకుంటారు. కాని అర్ధనారి తన మానసిక క్షోభనుంచి బయటపడడు. తానొక అబద్ధాల కోరునని, పెరియవాణ్ణని అనవసరంగా ఉన్నత వర్గానికి చెందిన మంచి మనసున్న వారిని మోసం చేసానని మదనపడుతూ సతమతమవుతాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి స్వామీజీగా మారిపోతాడు. స్వంత ఊరికి చేరుకున్న మరియమ్మ దేవాలయంలో పాఠశాల ప్రారంభించి ప్రాయశ్చితం చేసుకుంటాడు. సుమారు డెబ్బయ్యేళ్ల క్రితం మన దేశంలో వున్న సామాజిక పరిస్థితులను సి.రాజగోపాలాచారి మన కళ్ల ముందుంచారు.
శంకర్రావ్ ఖరత్ మరాఠీ దళిత కథ ‘బతుకుతున్న శవాలు’ గ్రామకట్టడి ప్రకారం వంతు చేసే ఒక కామాటి దుర్భర జీవితాన్ని చిత్రించింది. ఈ కథారచయిత శంకర్రావ్ ఖరత్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ పర్సనల్ సెక్రటరీగా పనిచేసినవారు. ముఖ్యంగా రచయితగా దళిత సాహిత్యానికి ఆద్యుడయ్యాడు. శంకర్రావ్ ఖరత్ ఇంకా కొంతమంది మరాఠీ రచయితలు, కవులు పూనుకుని దళితుల జీవితాల్ని సాహిత్యీకరించడంవల్లనే దాని ప్రభావం ఇతర భారతీయ భాషలపై పడింది. ఇతర భాషా దళిత రచయితలకే కాదు, దళితేతర రచయితలక్కూడా స్ఫూర్తినందించింది.
ఇక మరొక దళిత కథ ‘పరమాన్నం’ గురించి చూద్దాం. ఇది కన్నడంలో రాయబడింది. రచయిత కుం.వీరభద్రప్ప. కర్నాటకలోని బందాయి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినవాడు. దళిత జీవిత చిత్ర చేసినా, కళాత్మక విలువలు చెడకుండా, విషయాన్ని అతి సుందరంగా, నర్మగర్భంగా చెప్పగల శైలీ విన్యాసం ఆయన కలానిది! కేంద్ర సాహిత్య అకాడమీకి మన తెలుగు సాహితీవేత్త డి.రామలింగం సమకూర్చిన ‘ఒక తరం తెలుగు కథ’ సంకలనాన్ని కన్నడంలోకి అనువదించింది వీరే! ‘పరమాన్నం’ అనే ఈ కథలో రచయిత ఒక మహా విషాదాన్ని ఒక చిన్న సంకేతంతో అర్థవంతంగా చెప్పి ముగిస్తారు.
చివరగా కాళోజి నారాయణరావు తెలుగు కథ ‘తెలియక ప్రేమ-తెలిసి ద్వేషము’ చూద్దాం. కవిగా ప్రసిద్ధుడైన కాళోజి కథలు కూడా రాశారు! 1943లో ‘అణాగ్రంథమాల’ వారు వీరి కథల్ని పుస్తకంగా తెచ్చారు.
కథ ఇతివృత్తం ఈ విధంగా ఉంది. చనిపోయిన వారి ప్రాణాలు తీసుకుని యమభటులు కొందరు తమ లోకానికి వెడుతుంటారు. భటుల నుంచి అనూహ్యంగా లభించిన స్వేచ్ఛవల్ల రెండు జీవాలు దగ్గరై స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటాయి. ఆ రెండూ తెలుగువారి ఆత్మలే! దేవాలయ ప్రవేశం గురించి జరిగిన కొట్లాటలో వాళ్లిద్దరు ప్రాణాలు కోల్పోయినవారే! మనకు ముందు ఈ విషయాలు తెలియవు. ఈ కథలో రచయిత ఎంతో చమత్కారంగా సంభాషణ నడిపిస్తారు. ఆ ఇద్దరిలో ఒకడు సవర్ణుడు, మరొకరు అస్పృశ్యుడు. వాళ్లు తెలియక ముందు ప్రేమలు ఒలకబోసుకుని తెలుసుకున్న తర్వాత ద్వేషించుకుంటారు, నీచంగా కొట్టుకుంటారు.
ఈ విషయానే్న రచయిత ఎంతో వ్యంగ్యంగా చిత్రించారు. చివరకు యమధర్మరాజు వారిరువురికి శిక్షలు విధించడంతో కథ ముగుస్తుంది. రచయితగా కాళోజీ వ్యంగ్య వైభవం చదివి ఆనందించాల్సిందే! మానవ హక్కుల పరిరక్షకుడిగా బీజాలు ఆనాడే పడ్డాయనడానికి ఈ కథ ఒక రుజువు.

- డా. దేవరాజు మహారాజు, 9908633949