సాహితి
యాదగిరి మామా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫోన్ చేసి
‘నా పానం బాగాలేదురా
ఎట్లున్నవ్ అందరు మంచిగున్నరా
నిన్నూ అమ్మనూ చూడాలని ఉంది’ అడుగుతా
నువ్వు ఎక్కెక్కి దుఃఖించినప్పుడు
నా గుండె గూడుపట్లు కదిలిపోయినయ్ మామా!
తినడం పడుకోవడం ఒక్కటే కాదుకదా
ఎవరైనా ఏమి మంచిగుంటం చెప్పు
పొత్తుల కుటుంబం చిత్తిపోయి
ఎక్కడోల్లు అక్కడ చెదిరిపోయిండ్రు
ఎవరూ లేక సురువుశుద్దీ లేక
అక్కడక్కడ కూలిపోతూ
రేపుమాపు నేలవాలిపోతున్న
ఇల్లును ఈ నడుమనే
అమ్మేసి వచ్చిన మొత్తం అమ్మకిచ్చినం
తల్లి కడుపులనుంచి వచ్చినప్పుటి
బొడ్డుతాడు కోసేయబడ్డది
ఇక ఇప్పుడు ఊరితో పనిలేదు
ఎట్లున్నరంటే ఏంజెప్పమంటవ్
పొద్దుమాపు గోలీలతో
పోయే గాలిని నిలబెట్టుకుంటున్నం
మనుమలు మనుమరాండ్ల
అచ్చిబుచ్చి ముచ్చట్లతోనే
ఊపిరి తీసుకుంటున్నం
నిప్పుల బతుకులో నడిచి నడిచి
ఇక ఇప్పుడు ఉదయపు నడకతోని
చావురేవును చేరబోతున్నం
యాదగిరి మామా!
నిన్నూ తాతను ఎట్లమరిసి పోతననుకున్నవే
పరిగడుపుతో నడిచి శనిగరం
బడికి పోతున్నప్పుడు
అరేయ్! పిలిచి తాత చాటుకు
కాయిదంల కట్టిచ్చిన అటుకుల చుడ్‌వా యాది
ఇప్పటికీ నా మనస్సుల మెడుల్తనే ఉంది
మనుమని గోసను చూడలేక
గైయిండ్ల కచ్చ పానాది దాటేదాక
చూసే మా అమ్మమ్మ కండ్ల తడి
కలవరపెడుతూ నాతో కండ్ల నీళ్లు పెట్టిత్తనే ఉంది
ఎదిగిన నువ్వు కాకీ నెక్కరు మీద
బిందెతో జాలుకాలువ నుంచి
మంచినీళ్లుకు పోయే తప్పని నీ తిప్పలు
నన్ను ఇప్పటికీ ముప్పుతిప్పలు పెడుతూనే వుంది
ఆ కాలంల గానుక కులకశ్పిపోయి
మీకు బుద్ది తెలియనప్పుడు
మీ అమ్మ ఆస్తీ పోయి పుట్టిన ఊళ్లే ఉండలేక
హుస్నాబాద్‌నుంచి మీరు తంగళ్ళపల్లికి వచ్చి
పాండకతోల్ల అర్రల బుట్టి హోటల్‌లో
చితికిన బతుకుకు మాస్కిలేసుకున్న దుస్థితి
తనువంతా తల్లడిల్ల చేస్తుంది
మబ్బుల చౌడప్ప సిద్దప్ప పద్యాలు పాడే
వీరయ్యతాతా! బతుకు సారం తెలిసినా
చివరాకర్న భారంతో
సికింద్రాబాద్ మహంకాళమ్మ గుడిలో
ఎట్లా నిర్వీర్యుడైండో
తమ్ముడు హోటల్‌లో సర్వర్ ఎందుకైండో
రక్షణలేని నువ్వు వాచ్‌మెన్‌గా
ఎవరి కాపు కాసినవో
అందరం తలా ఓ దిక్కు చిక్కులపడి
చిందర వందరై పోతిమికదనే మామా!
నేత కార్మికులు రైతులు చస్తుంటే
కన్నీళ్లు తుడువ కూడా నోచుకోకపోతుండ్రు
ఒక అసమానత నుంచి
ఇంకో అసమానతకు నడక
బతుకంతా మెతుకుకోసం ఎంకులాటనే
ఫోనొక్కటే రానూ పోనూ అయినదగ్గర
నేనూ అమ్మా జెప్పనే్న
తప్పక వచ్చి ఒకసారి చూసిపోతమే
యాదగిరి మామా బెక్కన బెంగటీల
చెంచరీలకే యాదగిరి మామా!