సాహితి

ముందుచూపు లేని రచయితలకి ఓ హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరిలో ప్రజలంతా ఊరిని ఆవరించి వున్న అరణ్యాన్ని తెలుసుకోవాలని అనుకొన్నారు. అనుకొన్నదే తడవుగా ఎవరికి తోచిన మార్గంలో వారు ధైర్యంగా అరణ్యంలోకి దారితీశారు. మనసులో ధైర్యం, కాళ్లలో బలం ఉన్నవారు, ఆలోచనలో శక్తి ఉన్నవారు ముందుకి వెళ్లారు. ఏ దారిలో వెళ్లిన వాళ్లు ఏ వింతలు చూశారో, ఎంత దూరం వెళ్లారో వార్తలుగా ఊరంతా రోజూ చెప్పుకునేవారు, మనసుకున్న చంచలత్వం, ఆలోచనలో వైవిధ్యం, ఆకర్షించే నూతనత్వం వలన వెనుకబడినవారు, వారు ఉన్నదారిని వదులుకొని మరో దారిలోకి వెళ్లేవారు, కొద్ది రోజులలో ఏ దారిలో ఎంతమంది ఉన్నారు అన్న లెక్క మొదలయ్యింది. మనం వెళుతున్న దారే మంచి దారని నమ్మినవాళ్ళు, మిగిలిన దారులలో వెళ్లేవాళ్లని కలిసి, తాము ఉన్న దారి గొప్పతనం, ఎదుటివారి దారిలో ఉన్న లోపాలని చూపించి తమ దారిలోకి మార్పించడం మొదలుపెట్టారు. ఈ వాతావరణంలో సిద్ధాంతాల రాద్ధాంతాలు, వివిధ వాదాల వివాదాలు మొదలయ్యాయి. ఎన్నో దారులలో వెళుతున్న మేము కొన్ని దారులకే పరిమితమయ్యాము. వాదాలు అపరిమితం అయ్యాయి. వివాదాలు విస్తృతమయ్యాయి. కొట్టుకోవడం, కాల్చుకోవడం, చంపుకోవడం చాలా సామాన్యం అయ్యాయి. ఉగ్రవాదంతో కండబలం బుద్ధిబలాన్ని జయించే వాతావరణం ఏర్పడింది. మంద, మంద బలంతో మంద రాజ్యాన్ని ఏర్పరచి ఒక్కదారిలో మనుషులందరినీ మందలా తోలుకుపోవాలని వెనకబడిన వారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏమి తెలుసుకోవాలని బయలుదేరారో మరిచిపోతున్నారు.
ఇది క్లుప్తంగా వేల ఏళ్ల చరిత్ర ఉన్న నేటి మనిషి పరిస్థితి.
పుట్టి, గిట్టి, మట్టిలో కలిసిపోయే 87 లక్షల వృక్ష, జంతు జాతులలో మనిషి ఒక జాతి. ఒకరోజు మాత్రమే మనుగడ సాగించి మరణించే జాతులు కోకొల్లలు. తాబేలు జాతి తప్పించి మనిషి జాతి ఒక్కటే అన్ని జంతువుల కంటే ఎక్కువ కాలం జీవించే జాతి. ఎన్నాళ్ళు బతికినా, బతికిన రోజులలో తమ అనుభవాలని, ఆలోచనలని భావితరాల వారికి మిగిల్చిపోయే జాతి మానవ జాతి ఒక్కటే. ఆ పని చేసేది మానవ జాతిలోని రచయితలు ఒక్కరే.
రచయితలు గత రెండువేల ఏళ్లలో 470 భాషలలో వ్రాసినవి అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో 6.9 కోట్ల వ్రాతప్రతులు, 3.7 కోట్ల పుస్తకాలు ఫొటోలు, సంగీతంతో కలిపి సుమారు 16 కోట్లు ఉన్నాయి. మిగిలిన ప్రపంచ దేశాల్లో ఉన్న గ్రంథాలయాల్లో ఉన్నవి సుమారు నాలుగు రెట్లు అని అంచనా వేస్తే ప్రపంచంలో నేడు అందుబాటులో వివిధ ప్రక్రియలలో ఉన్న మానవ ఆలోచనా భాండాగారంలో ఉన్నవి 60 కోట్ల పైనే. ఈ రచనలు మానవ జాతి పురోగమనానికి పునాదులు. వాటి స్ఫూర్తితో సమకాలీన రచయితలు నేటి సమాజంలోని లోపాలని సరియైన కోణంలో విశే్లషించి సమాజంలో ప్రతీ వ్యక్తీ తన వారసత్వానికి గర్విస్తూ తన బాధ్యతలని తెలుసుకొని, తన తప్పులని సరిదిద్దుకోవడానికి కావలసిన రచనలని చేయాలి. అది రచయితలకు సహజంగా వచ్చిన సామాజిక బాధ్యత. సమాజంలో నిలబడ్డ వారి అస్తిత్వం కోసం రచనలు చేయడంతో మొదలైన రచయితలు వెనకబడిన వారి అస్తిత్వాన్ని ఆవిష్కరించడంతో ఆగలేదు. సామాజిక పరిణామంపై అవగాహన లేక తమకి తెలియని తమవారి తరతరాల కష్టాలకి పరిహారం కోసం రచనలు చేశారు. నేటి వారికి అర్హత లేకపోయినా అధికారం కోరారు. ఎక్కువ భాగం స్వార్థంతో, తక్కువ భాగం సామాజిక న్యాయం పేరుతో రచనలు చేసి ఈ ప్రకృతి విరుద్ధమైన దారిలో ప్రజలు ముందుకి పోవడానికి దోహదం చేసే రచనలు చేస్తూ వచ్చారు. వీటివలన, రాజకీయ ఒత్తిడులతో, మంద బలంతో వివిధ వర్గాలవారు, వివిధ జాతుల, వర్గాల, మతాలవారు తమ తమ అస్తిత్వ పోరాటాలని సాగిస్తున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. కులాలపరంగా లెక్క వేస్తే భారతదేశంలో మూడువేల కులాలు, 25వేల ఉపకులాలు ఉన్నాయిట. ఇప్పటివరకు పలుమార్లు మానవ నాగరికత ఉన్నత స్థాయికి చేరి నశించిపోయాయి. పెద్దపెద్ద పట్టణాలతో, దేవాలయాలతో, కోటలతో విద్య, వ్యవసాయ, వాణిజ్యాలతో విలసిల్లిన ‘మాయ’ నాగరికత సుమారు 800-100 సంవత్సరాల కిందట నశించింది. ఈ నాశనానికి రకరకాల కారణాలు పేర్కొనబడినా వెనకబడినవారికి, ముందున్న వారికి జరిగిన ఎడతెరిపి లేని ఆధిపత్యపు పోరు ముఖ్య కారణం అని పరిశోధకులు భావిస్తున్నారు. గత కొద్ది దశాబ్దాలుగా అగ్ర రాజ్యాలకి ఉగ్రవాద మతానికి మధ్య జరుగుతున్న పోరు జోరు పెరిగింది. నేటి మానవ సమాజంలో వేగం ఎక్కువ. 2014లో ఉగ్రవాద పోరులో 32,727మంది చనిపోయారు. అగ్ర రాజ్యాల యుద్ధ వ్యూహాలతో అంతర్యుద్ధాలతో ముస్లిం, అరబ్, ఆఫ్రికా దేశాలలో చనిపోయే వారి సంఖ్య అంచనాల కంటే ఎక్కువే ఉంటుంది. అందుచేత రచయితలు ముందుగా మేల్కొని ప్రజలని సరైన మార్గంలో వెళ్లడానికి, దేశం దానిద్వారా ప్రజలు మంచి భవిష్యత్తు పొందే మార్గంలో నడిపించడానికి కావలసిన రచనలు చేయాలి.
భయం, సంకుచితత్వం, స్వార్థం నేటి తరం రచయితలకు తమ ఆలోచనలని అక్షరాల్లో పెట్టడానికి పెద్ద అవరోధాలు. ఈ తరానికి అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్, ఇంటర్నెట్‌ల వలన ఆలోచనలను అతి వేగంగా అత్యంత ఎక్కువమందికి అందుతున్నాయి. దీనివలన మానవ జాతికి హాని కలిగించే ఆలోచనలకి కూడా తాత్కాలిక బలం అందుతున్నది. రచయితలు తెలిసీ తెలియని విభేదాలతో మనుషులని విడదీసే రచనలు చేస్తే నేటి నాగరిక సమాజం నశించిపోయే ప్రమాదం ఉంది. ప్రతిభ లేని మానవ జాతి అంతరించడానికి ఒక వైరస్ చాలు. గణ (గుంపు) బలం నుండి గుణ బలం వైపుకి ఎదిగిన జాతి మనది. గణ బలం వలన వెనకబడిన వారి కోసం రచనలు చేస్తున్నామని, ముందుచూపు లేని రచనలతో వెనకబడి పోతున్న రచయితలందరికీ మానవ జాతికి హాని కలిగించని, మంచి కలిగించే రచనలను నిర్భయంగా చేయాలని హెచ్చరిక.

- కలశపూడి శ్రీనివాసరావు, 9885074764