సాహితి

నిర్విరామ భ్రమణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్ముడూ! హృదయం లేనివాడెవడీ లోకంలో
వెచ్చటి కాంతి కిరణం సోకక
మెత్తటి స్నేహ చర్య దొరకక
పల్చటి తడి దారి కలవక
ఒక గడ్డ కట్టిన మంచు జడత్వంతోనో
చీకటి కాటుకలో వెలగని దీపంగానో
ఎండిన వాగులోకి విసరబడ్డ కంకర రాయగానో
మిగిలిపోతాం
తమ్ముడూ! శాశ్వతంగా ఏదుంటుందీ లోకంలో
కళ్ళముందే కొండలు కరిగిపోతున్నాయ
కాలచక్రపుటుండలూ తరిగిపోతున్నాయ
రక్తాన్ని మరిగించిన పొద్దూ వాలిపోతోంది
సాయంత్రానికల్లా పండుటాకూ రాలిపోతోంది
గాలిని తోసుకుంటూ
గూడు విడిచి వెళ్ళాల్సిందే పిట్టలాగా
రాయని తోసుకుంటూ వెళ్ళాల్సిందే
సరసరా నీటి లాగా
ఇవ్వాళ్ళ పొద్దటి పువ్వును చూడు
ఎంత కాంతి విరజిమ్ముతోందో
తమ్ముడూ! నిన్ను నిలువరించ గలవాడెవడీ లోకంలో
గాలికి ఎదురీదే తూనీగను చూడు
మళ్ళీ మళ్ళీ నిల్చునే గరికపోచనూ గమనించు
ఒకే ఆకాశం కింద చీకటి వెనె్నలా నాట్యాలు చూడు
రాత్రి భుజమీద చెయ్య వేసి
నక్షత్రమీద చూపునానించి
వెలుగు చుట్టూ తిరుగుతున్న భూమిని చూడు
తమ్ముడూ! నిర్విరామ భ్రమణం జీవితం
నిశ్చల వరణం మరణం

- బూర్ల వెంకటేశ్వర్లు