సాహితి

కొత్త తొడుగులు 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్పన సాహిత్యం సన్నగిలిపోయి, కథ అనేది మరుగు అయిపోతుందేమో అనే భయాన్ని మనసులో నింపుకుని కొందరు, ఈ ప్రక్రియకు ‘మ్యాజిక్ రియలిజమ్’ అనే కొత్త సంవిధానాన్ని మొదట్లో ఆ పేరు తెలియకుండానే ఆశ్రయించారు. సాంఘిక వాస్తవికత కూడా పాతబడిపోతున్న రోజులలో ఈ మ్యాజిక్ రియలిజమ్ ఉధృతం అయిపోయింది. క్యూబా, కొలంబియా దేశాలకు చెందిన ‘కార్పెంటీయర్’ ‘గేబ్రియల్ గార్సియా మార్క్‌క్విజ్’ రుూ వాస్తవికతను బహుళ ప్రచారంలోనికి తీసుకువచ్చారు. భారతదేశంలో రుూ ప్రక్రియను ‘వ్యాసుడు’ ఎప్పుడో ప్రవేశపెట్టాడని మన మునిపల్లె రాజు అంటారు. ఈ రియలిజం నిజానికి ‘సర్రియలిజమ్’కు పైస్థాయికి చేరిన ప్రక్రియ. మూడో ప్రపంచ వేతనం వికసితం అయింది- అనడానికి యిది సంకేతంగా పనికివచ్చింది. ఎదిగీ ఎదగని దేశాలు పాత పద్ధతులకు స్వస్తిచెప్పి కొత్తదారులు వెదుక్కుంటున్న ధోరణి యిక్కడ ప్రస్పుటం అవుతుంది.
మాజిక్ రియలిజమ్ అవలంబించే రచయితలలో కొన్ని సామాన్య లక్షణాలు వున్నాయి. వాళ్లు స్వగృహాన్ని, స్వగ్రామాన్ని, స్వరాష్ట్రాన్ని యింకా వీలయితే స్వదేశాన్ని, వదిలి అనేక చారిత్రక సాంస్కృతిక కారణాల ప్రోద్బలంవల్ల దూరంగా వెళ్లిపోయి పరాయి తావులలో జీవనం చేస్తున్నారు. ఒక విధమయిన ‘సందిగ్ధం’లో కూరుకుపోయి వున్నారు వాళ్లు. ఒక రకంగా వాళ్లకు ‘మూలాలు’ లేవు. స్వస్థలం, (నేటివ్ ప్లేస్) యేమిటి అంటే వెంటనే జవాబు చెప్పలేరు. ఉన్నచోటున నిలదొక్కుకోలేకపోయారు. పరాయిచోట కలిసిపోలేకపోతున్నారు. అబద్ధమో, సుబద్ధమో ఒక అహంభావం అడుగడుగునా అడ్డుపడుతూ వస్తోంది. వాళ్ల రచనలలో పొందే సన్నివేశాలు, ప్రతీకల, పాత్రలు- యివన్నీ విశ్వజనీనమయినవే తప్ప, ఒక ప్రత్యేక ప్రాంతానికి సంబంధించినవి అవడానికి అవకాశం లేదు.
అభూతకల్పనలు, జానపద సన్నివేశాలు, దేవలోక పాత్రలు- యివన్నీ మేజిక్ రియలిజమ్‌లో అంతర్భాగం. కొందరు రచయితలకయితే మనుష్యలోకం కంటె మానసిక లోకం- దేవలోకం మరింత నిజమైనది అనిపిస్తుంది. దరిద్రం- అవినీతి- తెలియకపోవడం కాదు. ‘మనమంతా మనుష్య మాత్రులం. మనను నడిపించే శక్తులు వేరే వున్నాయి. అవి మనమధ్య విరివిగా తిరుగుతూ వున్నాయి. అనే విశ్వాసం కూడా చాలమంది అలవరుచుకున్నారు. పాఠకులకు తమ పరిస్థితులతోను, స్థితిగతులతోను విసుగెత్తిపోయింది. జీవన విధానం మొరటుగా, అరులుదాయకంగా తయారయింది. ఏదో ‘వి’చిత్రం జరిగి పరిస్థితులన్నీ అకస్మాత్తుగా మారిపోవాలని వాళ్ల ఆకాంక్ష. దీనికి తగిన రచన సామాగ్రి వాళ్లకు ఆనందదాయకం అవుతోంది.
చదువరుల మీద దీని ప్రభావం మటుకు తాత్కాలికంగానే వుంటుందనీ శాశ్వత ముద్రవేయదనీ విమర్శకులు గుర్తుచేస్తు వుంటారు. ప్రతి తరంలోనూ ప్రస్తుతంనుంచి అసహనంతో దూరతీరాలకు ఎగిసిపోవాలనే చదువరులు వుంటారు గనుక ఈ సంవిధానం మరుగుపడిపోతుందనే అభిప్రాయంతో అంత త్వరగా ఏకీభవించలేము. ఉదాహరణకు: బూతు కథలు అని మనం అనుకునేవి ‘ప్రణయ కథలు’, ‘శృంగార కథలు’ అని కొత్త తొడుగులు తొడుక్కుని బయటకురావడం మనం చూస్తూనే వున్నాం.
ప్రపంచ చరిత్రలో - మానవ సంబంధాల మానసంలో యింకా తరచి చూడని ‘చీకటి కోణాలు’ చాల వున్నాయి. వీటిపై వెలుగులు ప్రసరించి, మానవ స్మృతిని ప్రకాశవంతం చేయడం మటుకు సాధ్యమే. మానవ మేధాశక్తిని విస్తృతపరచడం కూడా సంభవం. రచయితకు చరిత్ర ‘తరగని గని’. అవి ఎన్నయినా విషయాలను అందిస్తుంది. అంటే చారిత్రక కథలు రాయాలని కాదు ఉద్దేశ్యం. చరిత్రను సమాంతరంగా ఉపయోగిస్తూ కాల్పనిక సాహిత్యం నిర్మించటానికి అవకాశం ఎంతయినా వుంది. ఇలాంటి ప్రయత్నం విజయవంతంగా చేసిన రచయితలు కూడా మనలో చాలామందే వున్నారు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584