సాహితి

‘కాలనాళిక’కు కవితల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలని, పాలన బహుముఖాలై విస్తరించాలని రచయితలు కోరుతున్న సందర్భంలో అక్షరం నిఘా పెరగవలసి ఉంది. ఇప్పుడు కలాల మీద బాధ్యత పెరిగింది. కాబట్టి అక్షరాలు ఇవ్వాళ పూర్వశక్తిని అమేయంగా పుంజుకోవాలి. 1932లోనే తెలంగాణలో కవులు లేరన్నందుకు ‘గోలకొండ కవుల సంచిక’ వెలువడినట్లు, తెలంగాణలో ప్రజల పక్షం వహించి కవులు ప్రజాభావనలకు అనుగుణంగా రాసే కవులు లేరనే అపవాదుని తుంచివేయాలి. అయితే ‘కాలనాళిక’ పేర ఆవిర్భావానంతర తెలంగాణ కవితా సంచిక వెలువరిస్తున్నాం. త్వరలో మహబూబ్‌నగర్‌లో జరిగే ‘తెలంగాణ రచయితల వేదిక’ జిల్లా మహాసభలలో ఎంపిక చేసిన కవితల సంచికని విడుదల చేస్తాం. దీనికి సంపాదకులుగా జయధీర్ తిరుమలరావు, జలజం సత్యనారాయణ వ్యవహరిస్తారు. కవితలు పంపవలసిన చిరునామా: కాలనాళిక, 402, ఘరోండా అపార్ట్‌మెంట్, డి.డి.కాలనీ, హైదరాబాద్ - 500 007