సాహితి

నా ఊహల పిచ్చుక గూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చి పచ్చి తాటికమ్మలు
పెద్ద పెద్ద బండరాళ్లను నెత్తికెత్తుకుని
సచ్చిపుట్టిన
తాటి కమ్మల బతుకు చిత్రం నాది
గుడిసె కొనగొమ్ము మీద
గోనెసంచి కట్టుకుని
సుతిలబద్ద పట్టుకున్న అయ్య
రుషి లెక్కనే మాట్లాడుతడు
నేనేమో
గుడిసెకన్ని సక్క సక్కటి వాసాలు
వెట్టాలని అంటా
తానేమో
వంకర దాని దాపున సంకటిది
సంకటి దాని దాపున వంకరది
మనిషి కూడా అంతే అంటడు
మళ్లవోతే
అన్ని గల్తెనే గుడిసె పొంకంగ ఉంటదని
వాసాలన్నిటినీ కలిపే పెండెకట్టు లెక్క
మాట్లాడుతడు.
పాతకమ్మలు అసలే పెట్టద్దు
అవి మూడేండ్లయి అని నేనంటే
మూడేండ్లు అయిన కరుకు మీదనే వున్నై
పాత కమ్మల మీద కొత్త కమ్మలు
అద్దినంటుగా వుంటయి
కమ్మల రానీ ఎయ్యి ఎయ్యవయా అంటడు
అయ్య అట్ల పేర్సుకుంటవోతె
సుతిల బద్ద
కమ్మల గుండెలను ముడివేసే
ఆత్మగల్ల వాక్యమైతది
అందులోనుంచి నాకు
సుతి దెల్వని సంగీతం ఇనవడుతది
గుడిసె నా బతుకు, నాకాయిషు
నా ఊహలు పిచ్చుక గూళ్లు కట్టుకున్నవి
ఈ గుడిసెలోనే
నా ఆకటి కుండను కుక్క ముట్టకుంట
కాపాడింది కూడా అదే.

- నాగిళ్ల రమేశ్, 7382744824