సాహితి

కవిత్వానికి దూరమవుతున్న పాఠకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కవిత్వం ఎన్నో చైతన్య జ్వాలల్ని, ఉత్తేజ తరంగాల్ని, ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తూ నేటికీ ఓ తీరని దాహంగానే ఉంది. అందులో పాఠకుడి పాత్ర ఎన్నదగినది. అలాంటి పాఠకుడు ఇవ్వాళ కనుమరుగు అవుతున్నాడా? నిజం చెప్పాలంటే చాలావరకు అవును అనే సమాధానం వస్తుంది. సాధారణంగా కవిత్వం చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు. కథల విషయంలో వున్న ఆసక్తిని కవిత్వం పట్ల ఎందుకు కనబరచడం లేదు. బహుశా కవి అంతరంగాన్ని లోతుగా చూసి పట్టుకోవడానికి పాఠకుడి స్థాయి సరిపోవడంలేదు అనుకోవాలా? లేక కవులు వైయక్తికంగా రాసే క్రమంలో పాఠకుడ్ని మరిచిపోయారా? పాతకాలంలో పురాణాలను, మంచి గ్రంథాలని చదవడం వలన వాటిని ఆమూలాగ్రం చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించేవారు. ఇప్పుడు అంత సహనం పాఠకుడిలో లేదు అంటే ఎవరిని తప్పు పట్టాలి? ఇటీవలి కాలంలో వస్తున్న కవిత్వం చాలా వరకు అర్ధం కానిదని, కొండొకచో అర్థం లేనిదనీ పాఠకులు విమర్శించడం తరచుగా కనిపిస్తోంది. దీనికి సమాధానం ఎవరు ఇవ్వగలరు. కవులు తమ ధోరణిలో తాము రాసుకుంటూ పోతారు. పాఠకుడికి అర్ధం అయ్యేలా చెప్పలేకపోతే అర్థం కానిది వ్యర్థమే కదా. అలా అని కవుల స్థాయిని కించపరచడంలేదు కానీ అర్ధం కాని పదాలతో... అమూర్త భావనలతో, మెదడుని ఎంత చించుకున్నా అర్థం కాని పద చిత్రాలతో కవిత ఉన్నప్పుడు అలాంటి వాటిని చదవడానికి ఎవరు సాహసిస్తారు... దీనికి చక్కని ఉదాహరణ ఒఖూళ్ఘజఒౄ ఘశజూ ఘఇఒఆ్ఘషఆ కవితలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. కవి తన అంతరంగాన్ని తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని తనదైన మార్గంలో వెళ్లినపుడు పాఠకుడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తన ధోరణిలో తాను కవిత్వీకరించుకుంటూ పోతే అది ఎప్పటికీ పాఠకుడిని చేరుకోలేదు... కవి తన కవితకి ఒక రూపం, లయ, భావం ఇన్ని సమ్మిళతం చేసినా పాఠకుడి స్థాయికి చేరుకోనప్పుడు కవి ప్రయత్నం వృథా కావలసిందే. కవి తన కవితలకు చేరువగా పాఠకుడిని తీసుకురావాలంటే, కవి తమ స్థాయికి పాఠకుడిని తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. డఖూళ్ఘజఒౄ ఘశజూ ఘఇఒఆ్ఘషఆ పోయెమ్స్ అనగానే చాలామంది కవులు వెనకడుగు వేస్తారు. ఎందుకంటే అవి పద చిత్రాలతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడినవి కాబట్టి.. మరి కవి తను పొందిన అనుభూతిని పాఠకుడికి పంచాలి అంటే సులువైన మార్గం వెతకాలి. అప్పుడే కవి చెప్పిన అర్థాన్ని చదువరి అందుకోగలడు. సాధారణంగా కవిత్వం అంటేనే పెద్దగా ఆసక్తి చూపని వాళ్లు ఇక కష్టంగా, అర్థం కాకుండా వచ్చే వాటిని ఎలా చదవగలరు? చదివి ఎలా ఆస్వాదించగలరు? కాని కవుల వాదన మరోలా ఉంటుంది. పాఠకుడి స్థాయి పెంచాలి అంటే తాము ఒక మెట్టు దిగి రాయనవసరం లేదు, దానికి బదులుగా పాఠకుడే తన స్థాయిని పెంచుకోవాలి అంటారు. కవిత్వం చదివి అర్థం చేసుకుని, అదొక సాధనలా మార్చుకుని ముందుకు వెడితే తప్పకుండా తాము రాసినది అర్థం అవుతుంది అంటారు. ఇది కొంతవరకు నిజమే. సాధారణంగా పాఠకుడు ఏమీ తెలియకుండా అంటే సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వం గురించిన అవగాహన ఉండడం ఎంతైనా అవసరం. అది తెలిసిన వారికి కవిత్వం పరిభాష తప్పకుండా తెలిసి వుంటుంది. కానీ అందరూ అవి తెలుసుకుని ఉండి తీరాలి అనుకోవడం కూడా సరికాదు. సాధారణ పాఠకుడికి కవిత్వ పరిభాషా పదాలు, పద చిత్రాలు టెక్నిక్స్ ఇవేమీ తెలియకపోవచ్చు. కాని కవిత ఆత్మని పట్టుకుని అది తనలో కలిగించిన అనుభూతిని మాత్రం ఫీల్ కాగలడు. అలా పాఠకుడిని ఫీల్ అయ్యేలా, ఆసాంతం చదివించేలా రాయాలి. అనుభూతి ముఖ్యమా? అక్షర పదబంధం ముఖ్యమా? అని పాఠకుడిని ప్రశ్నిస్తే అనుభూతికే ఓటు వేస్తాడు. ఎందుకంటే కవి యొక్క కవిత అతని జీవితంలో ఏదో ఒక కోణాన్ని స్పృశించి ఉండవచ్చు. అది మర్చిపోకూడదు మనం. క్లిష్టమైన పదబంధాలు, లోతైన భాషా పటిమతో మంచి కవిత్వం పుట్టదు. కవియొక్క అనుభవాల పరంపర అభివ్యక్తమయ్యే రీతి కళాత్మకంగా, తమ హృదయాలకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే పాఠకుడు అందులో తనని తాను ఆవిష్కరించుకోగలడు. అలాంటి వాటిని ఈ రోజుల్లో ఎక్కడైనా చూడగలుగుతామా? సాహిత్యంలో ముందుగా పాఠకుల సంఖ్య పెరగాలి అంటే, కవులు తమ స్థాయిని తగ్గించుకోకుండానే కవిత్వాన్ని సులభరీతిలో సరళంగా రచిస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మరో ముఖ్య విషయం- పాఠకుడు కవిత్వాన్ని అక్కున చేర్చుకోవాలి అంటే భాష ఒక్కటే కాదు భావం కూడా ముఖ్యమే. అది వైయక్తికంగా కాకుండా సామాజికంగా ఉన్నప్పుడు అలాంటి కవిత్వాన్ని మరింత ప్రేమిస్తాడు. అభిమానిస్తాడు. కవిత్వం న్యూస్‌పేపర్ చదివినంత ఈజీగా చదవడం కుదరదు. కవిత్వం వ్యాకరణం తెలిసిన వాళ్లు కవిత్వాన్ని అర్థం చేసుకోలేరు. అలా అర్థం అయ్యేలా చెయ్యాలి అంటే పాఠకుడు కొంత సాధన చేయక తప్పదు. కవిత్వ పుస్తకాన్ని చదివి ఒక పాఠకుడు సలాం కొడితే మరొక పాఠకుడు చీదరిస్తాడు. అందరి స్థాయి ఒకేలా ఉండాలని లేదు. కవి ఏదయితే అనుభూతి చెంది రాసాడో, అదే అనుభూతి పాఠకుడు కూడా పొందగలిగితే అదే ఉత్తమ కవిత్వం. కవిత్వమంటే అనుభవించిన క్షణాల్ని అక్షరాల్లోకి అనువదించడం, ఆ అనువదించిన అక్షరాలని పట్టుకుని పాఠకుడు కవి పొందిన అనుభూతిని పొందగలిగినపుడే ఆ కవిత్వం సార్థకమవుతుంది. చివరగా కవిత్వం నుంచి పాఠకుడు దూరం కాకుండా ఉండాలంటే అతని స్థాయిని పెంచుతూ సులభ రీతిలో అందరికీ చేరువయ్యేలా రచనలు చేస్తే పది కాలాలపాటు కవిత్వాన్ని రాసే కవుల్ని ఎన్నడూ వీడడు.

- సిహెచ్. పుష్యమి సాగర్, 9032215609