సాహితి

కంటతడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెగిన మత్తడి
నీళ్లు లేని నేల దుఃఖం
మట్టి బతుకు
ఉరితాడుకు నైవేద్యం
కరువు వేటుకో
కరంటు పోటుకో
సేద్యం కొండెక్కిపోతుంటే
బతుకు రేడియోలో
జాడ తెలీని బాధల కేంద్రాలెన్నో
ఎండిపోయిన మోట బావుల్లాంటి కళ్లల్లో
సందె వేళ
వరి మడికి నీరు పారించినట్టు
మట్టిలో నాటిన
మునివేళ్లని ముద్దాడాలి
మట్టిలో విత్తనమంటూ పడ్డాక
తాను చిట్లడం
నేలను చీల్చడం తప్పుతుందా?
చినుకులు చిద్విలాసం చేసినప్పుడు
చుట్టూ నేల తేమలో
బిగుసుకుపోతున్నప్పుడు
మొలకెత్తడమంటే
గాయపడిన చీకటి
మళ్లీ వెలుతుర్ని ప్రసరించడమే
మోట నాటు పాట కచేరి
వరి చేలపై వడిసెల మోత
బుగులు బుగులైన ఈ నేలంతా
బంధింపబడని బందీలా
ఒప్పందాలన్నీ ఒట్టి పాల పొదుగు

- ఎస్.ఆర్.భల్లం