సాహితి
పునర్జన్మిద్దాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 January 2016
- మొగిలి స్వామిరాజ్, 9963642205
పేరాశల పేర్చుబడిలో
ఆశల భవంతుల్నెంతకాలం
నిర్మించుకుంటూ జీవిద్దాం
అబద్దాల బడుద్దాయలమని
మనల్ని మనమే ఎంత దూరం
చాటుకుంటూ గడిపేద్దాం
రేపటికి కనీసపు మంచివారమని
ఆనవాళ్లనయనా మిగుల్చుకుందామా
నేటిని నేటి దినంలోనే
దినవారాలు గావించుకుందామా...
పునర్జన్మించడం నేర్చుకుందాం
అబద్ధాత్మ సాక్ష్యాల్ని వమ్ముచేసి
మనీ+షిలా బ్రతుకడం మానుకొని
అక్రమ దారుల్నించి తప్పించుకొని
విష సంస్కృతుల చెరవిడిపించుకొని
నవ నాగరికమంటూ భ్రమించడం మాని
అనాగరికం గోతుల్ని పూడ్చుకొని
పునీతుల మవుదాం
అప్పుడయనా మార్పు దిశ కనిపిస్తుందా
మనకై మనం
దిశా నిర్దేశం చేసుకుందాం
పునరావిర్భావ నొప్పులకు ఉపశమనానికి
లేపనం తయారు చేసుకొని రాసుకుందాం
నవ నిర్మాణ
నూతన చరిత లిఖించుకుందాం.