సాహితి

సీతాకోక చిలుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరీడి కంటె ముందె పెదవుల్ని ఎర్రబరచి
రాత్రి గోడకు తగిలించిన దొంగ నవ్వు తొడుగు
పౌడరద్దిన ముఖానికి తగిలించి
తప్పని కరచాలనలకు చేతుల్ని సిద్ధంచేసి
వేళ్ళు కలబోసుకుని కబుర్లు చెప్పుకునేలా
సాక్సుల్లో కాళ్ళుపెట్టి సాయంత్రం దాకా ఏడవకండంటూ
బూట్లెక్కించి బిగుతుగా లేసులల్లి
ఇంటికి గుండెకు బీగం బిగించి
తాళం చెవిని రహస్యపు జేబులో వేసుకుని
టకటకమంటూ డ్యూటీలోకి దిగుతాను.
రెక్కలు ముడవని సీతాకోక చిలుకలా
ఎగిరెగిరి డ్యూటీనుంచి దిగుతూంటే
రాత్రి సూరీడు కాళ్ళకిందకు చేరుతూ
ఇంకా కొంపకు చేరలేదా అంటాడు
రాత్రి మంచం మీదకు చేరేసరికి
కాలివేళ్ళు గాలి పోసుకుంటూ నిద్రపోతుంటాయి
నేను మాత్రం కవిత్వాన్ని వొళ్ళంతా అల్లుకుని
గగన వీధుల్లో, నక్షత్ర లోకంలో జవనాశ్వాలు కట్టిన
అపరంజి రధమెక్కి పోతుంటాను
అపుడు ఇంద్రుడో, ఉపేంద్రుడో ఎవరయితేనాకేటి?
నా వెనుక అబ్బురంగా నన్నూ, నా తేరును తేరిపారచూస్తుంటారు
నన్నల్లుకున్న కవిత్వం సుగంధమై లోకమంతా గుబాళిస్తూ కరిగిపోతుంది.
నే సాగిసాగి చివరగా పొద్దుపొడుపును పలకరించి
అరుణిమను కుశలమడిగి, తూర్పు కొండమీంచి
సుతిమెత్తగా నా పక్క మీదకు దిగుతాను,
కాస్సేపట్లో తోడ ఝాడించజూస్తున్న రాత్రిని
గబగబ పట్టుకుని గది బయటకు బలవంతంగా గెంటేసి
నిద్రని నిద్రను చిలక్కొయ్యకు తగిలించి
ఊహాక్షరాలను తలగడ కిందకు తోసేసి
మళ్ళీ సూరీడికంటె ముందె లిప్‌స్టిక్కందుకుని
టకటకమంటూ డ్యూటీకి తయారయిపోతాను.
*

- నారాయణమూర్తి తాతా, 9298004001