సాహితి

కండువా ఒక పూలహారమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌరవానికి గుర్తుగా
భుజాన నేను..!
ఇష్టదేవుని పూజలో
భక్తి మడిమాలనై
పెళ్ళిలో ఎదుర్కోళ్ళలోన
ఆత్మీయ బంధువునై
పండించే రైతు తలపాగానై
అలసిసొలసిన ముఖానికి ఆసరానై
పార్కులో కుర్చి మట్టిపై ప్రతిమనై
బస్సులో జాగాకోసం
కిటికీ నుంచే తోడులా
రైలు ప్రయాణంలో
తలకింద మెత్తని దిండులా
పండగనాడు బుజ్జోడి నడుముకి ధోవతినై
రకరకాల రూపాల్లో
నా ప్రతిబింబాన్ని నేనే వెతుక్కుంటాను..!
ఓటమి చుట్టుముట్టినా
ఆదరించే స్నేహితుడిలా
చిరిగి పాతబడినా
ఇంటిని శుభ్రపరిచే సాధనంలా
తడిపి మడిచి ఉతికారేస్తే
దిగమింగిన బాధతో
ఎండలో తీగపై రెపరెపలాడేలాగా..
పెద్దల సత్కారాల చేతుల్లో గొప్పగా..
అభిమానంతో మెండుగా
చిన్న కండువానై
చివరి దశలోనూ
వదిలేసి ఉండలేనంతగా
నాలో నేను పూలహారంలా....!!
*

- డి.ఎన్.వి.రామశర్మ, 9663526008