సాహితి

స్వప్న లిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబ్ద చేతనా స్వరూపాన్ని శిల్పిస్తున్న
అక్షరం మీంచి
ఱెక్కలు చాటిస్తూ ఒక పక్షి లేచింది
క్రియాశక్తికది కీర్తి పతాక
పల్లవిని ఆకాశపుటంచులకు చేర్చింది
పాట మొత్తం పర్సమేఖల మీద పరుచుకుంది
ఆత్మగీత సారాంశపు సరిహద్దుల్ని స్పృశించి
దిగంత రేఖమీద
బింబరూపాల దివాక్షప విశే్లషణని విశదపరుస్తోంది
మంచుబొట్టులో రంగులు కలబోసుకుంటూ
నా అంతర్లోక ప్రవృత్తమైన నాదాహంకారం అనే్వషిస్తున్న
సౌందర్య జాత రూపాన్ని చిత్రిస్తూ-పక్షి...
పృధ్వీ గర్భస్థ పీధ నికషోపలం మీద
రసార్ద్రంగా సాగి పాకే తల్లి పేరు తాటించి
తామస పరీమళ తంత్రుల్ని మీటుకుంటూ
శిరసు మీది వర్ణవిభ్రాజిత కిందుక కిరీటాన్ని గంధిల జేసి
మార్తాండ మణోచక హృదయ ప్రభాస క్షారం త్రాగుతూ
తఱపి పాల తేనె వెనె్నల్ని తొణికించే
చాంద్రీమయ నిశాశిల్పి చంద్రుడ్ని
పాటమీద సవారి చేసే పక్షిని మోస్తూ
సంక్రాంతి మైదానంమీద చల్లని మంచు ముత్యాలేరుకుంటూ
ప్రవాహంలా పరిగిడుతున్న తారళ్యాన్ని తడిమి
రాలుతున్న నక్షత్రాల వంటి పూల సంఫుల్లతకు పాదుచేసి
వర్ణబీజంగా మలచి నన్ను వసుధ మీదే చల్లుతుంది-చెట్టు...
పురాతన పద్య పంక్తుల్లోని అర్ధశోభ
శిల్ప తాత్పర్యంగా చివురులు తొడుగుతున్నప్పుడు-నేను
వేకువ కోనేట్లో వెలుతురు స్నానం చేస్తున్నాను
సౌందర్యాన్ని వ్రేళ్ల మధ్య యిరికించుకొని
అక్షర రేఖా చిత్రం వేస్తుంటే
పువ్వులు నేలలోంచి వచ్చి నా నగ్న కాంక్షకు
రంగుల్నద్దుతున్నాయి
పచ్చటి ఆకుల్లో పడి పాట నూదుతున్న పక్షి
ఋతువును స్వాధీనపరుచుకొని ఊహను ఉత్ప్రేక్షిస్తోంది
చైత్రానికి చంద్రుడ్నై అవతరించి
కవిత్వం కోల్పోయిన కాలానికి
పద సంధ్యా పవిత్రాన్నద్దుతున్నాను...
సంవేశార్ణంగా సాక్షాత్కరించి
సూర్యోదయాన్ని ప్రసవించే కవ్యక్షర గాఢాభిజ్ఞత
సింహ వక్త్రం లాంటి సిందూర పుష్పం
వసంతం వాకిలి తెఱవక ముందు
వనమంతా
వౌన సమాధిని వశం చేసుకున్న
తరుగర్జా తపోభూమిక
ప్రార్ధించకుండానే ప్రత్యక్షమైన ప్రాణమోని పక్షి
రేబవళ్లకు ఉద్దిష్ట సంకేతాలైన రెండు ఱెక్కల్ని చాచి
నన్ను పొదవుకొంటుంది
దిక్కుల్ని ఆక్రమించుకునే వాక్కునై
నేనంతటా వ్యాపిస్తాను...

- సాంధ్యశ్రీ 8106897404