సాహితి

శిథిల కోటగోడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మొండి కోటగోడలు
ఎంత వైభవాన్ని
ఎన్ని ఉద్వేగాలను చవి చూడలేదు?
ఎన్ని దౌర్జన్యాలను
ఎన్ని దుర్మార్గాలను
నేలమట్టం చేస్తుంటే
భయంతో కళ్ళు మూయలేదు!
గోడలకు చెవులుంటాయి కాని
నోళ్ళుంటాయా?
గుట్టు విప్పడానికి!
ఆ రాజుల వీరత్వం
ఆ రాణుల ప్రేమ పురాణం
వారి విచ్చలవిడితనం
వారి విలాసాలు విలాపాలు
అన్నీ మట్టికొట్టుకపోయినవి
ఈ శిథిల రూపాల్లోనే!
ఇప్పుడెవరెంత గట్టిగా
ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా
ప్రతిధ్వనులే గాని
సాక్ష్యంగా పరిచారికలు ఊడిపడరు!
దొంగలు ఆధారాలు వదలివెళ్ళినట్లే
చరిత్ర ఈ శిథిల గోడల్నిచ్చింది
తవ్వుకోవాలి
విలపించడానికైనా
వివేచించుకోడానికైనా!

- కోట్ల వెంకటేశ్వరరెడ్డి