సాహితి

చల్లని పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశానికి చిల్లుపడింది
వర్షం!

వన్ హెచ్‌పి బోర్‌లా
కంటిన్యూగా
ప్రవహిస్తోంది నీరు

బీటలు బారిన నేలకు
ఎడారిలో లభించిన
వెరి కూల్‌డ్రింక్‌లా

దాహార్తి తీర్తించి
వరుణ దేవుడి పుణ్యంతోనే
భూతల్లి గర్భాన
సువర్ణ పంటలే పండుతాయ్
రైతన్నల బంగారు కలలన్ని
తప్పకుండా నెరవేరుతాయ్

మనిషి బ్రతుకంతా యాంత్రికమైతే
నిరంతర కాలం జవాబుదారి అవుతుంది

ఉదయ సంధ్యా సాయంసంధ్యాలలో
మనిషి గుండె నొప్పితో బాధపడుతుంటే
ఉరుములు లేని ఆకాశంలో
మెరుపులు లేని మేఘాల మధ్యలోంచి

ఫెళఫెళమంటూ శబ్దం చేస్తూ
చల్లని పిడుగు పడటంతో
ఋణానుబంధం తీరి
ప్రాణం పై లోకాలకు వెళ్లింది

- బి.చంద్రశేఖర్, 9640037003