సాహితి

అమ్మకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారపు పదవి కోసం కాదు
మమకారపు అమ్మదనం కోసం..
మందులూ మంత్రాలూ మొక్కులంటూ
తిక్కదానిలా తిరిగి తిరిగీ..
నీ కడుపులో నన్ను నిలుపుకున్నావ్
నిలిచి పెరిగే బిడ్డ నీలాంటి అమ్మేనంటూ..
బుగ్గలు చిదమాల్సినవాళ్ళు
ప్రాణాల్ని చిదిమేయబోతే
నీ బ్రతుకు సుఖాల్ని బలిచ్చి
కష్టాల్లో కొట్టుకులాడావు
మనిషికి మనుగడనిచ్చే తల్లి పదవిని నాకిచ్చావు
అమ్మా! నేను మానవత్వాన్ని కంటాను
మమతానురాగాల్ని కంటాను
హెచ్చునున్న కృతజ్ఞతల రాశుల్ని కంటాను
అవగాహనల సుగంధాలిచ్చే పూవుల్ని కంటాను
ఆప్యాయతల రసాలూరే హృదయాల్ని కంటాను
అమ్మల్ని కనే ఆడబిడ్డల్నే కంటాను
అమ్మనూ అమ్మ మనసునూ
అలా బ్రతికించుకుంటాను
అమ్మ ఋణం అలా తీర్చుకుంటాను!
అమ్మా! నేను నినే్నకంటాను!

- జి. సందిత