సాహితి
గాలి వీస్తుంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 31 January 2016

గాలి వీస్తుంది
కదలిక మొదలవుతుంది
హాయిగా వుంది చెట్లకి -
చెట్లై నడుస్తున్న ఆ జంటకి కూడా
నడక సాగుతుంది
దోవ మసకబారుతుంది
అర్థహీనమైన ఒక ఆలోచన
అసంబద్ధమైన ఒక ప్రతిపాదన
ఇద్దరి మధ్య వైరం; నేరం ఎవరిదో
విశ్వాసం కనుమరుగైంది
విడిపోవడం నిజమైంది
గాలి వీస్తుంది
మందంగా కాదు
సంద్రంగా-
- కోటం చంద్రశేఖర్
9492043348