సాహితి

పాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు
ఓ సరికొత్త పేజీనే
క్షణానికో ప్రశ్నోదయం
అక్షరాల్లేని పుస్తకాల్లో
సమాధానాల కోసం వెతుకులాట!
అనుభవాల కలం
అనుభూతుల గతాన్ని లిఖిస్తుంది
మార్కుల్లేవు కాని
నిమిషానికో పరీక్ష!
అలుపెరగని నిత్య సాధన
అందులేని సత్య శోధన
వర్తమానపు గొంతుతో
వల్లె వేస్తూనే వుండాలి
మానిన గాయాల అడుగు జాడల్ని
అతిక్రమిస్తే విరుగుతుంది
కాలం చేతి క్రమశిక్షణ బెత్తం
వద్దన్నా వినక తప్పదు మరి
విధి నేర్పే జీవిత పాఠం.
- డేగల అనితాసూరి
92447500819