సాహితి

29న యానాంలో శిఖామణి ఆరుపదుల సాహితీ ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సమాఖ్య సంయుక్త నిర్వహణలో ప్రముఖ కవి శిఖామణి ఆరుపదుల సాహితీ ఉత్సవాన్ని ఈ నెల 29వ తేదీ ఉ. 9.30 నుంచి యానాంలో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షులు దాట్ల దేవదానం రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు శిఖామణి సాహితీ పురస్కార ప్రదానంతో పలు గ్రంథాలను కూడా ఆవిష్కరిస్తారు. శిఖామణి పరిశోధకులకు సత్కారం, కాళోజీ అవార్డు గ్రహీత డా. ఆర్.సీతారాంకు అభినందన సత్కారం, కవి సమ్మేళనం కూడా జరుగుతుందని పేర్కొన్నారు. మల్లాడి కృష్ణారావు, మండలి బుద్ధప్రసాద్, రవీంద్రబాబు, కారెం శివాజీ, కొలకలూరి ఇనాక్, తనికెళ్ల భరణి, మృణాళిని, ఓల్గా తదితరులు హాజరుకానున్నారు.