సాహితి

మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలిమబ్బులతో దాగుడు మూతలాడుతున్న
వెనె్నల రేకుల మీదుగా
సౌందర్యపు అపరిమితత్వాన్ని ప్రణవిస్తూ
నక్షత్రాల తమకాలలో జారిపడిన సవ్వడిలో
ప్రకృతికి మెత్తని చలనాన్ని స్తూ
రేయి చిక్కబడింది

పగలంతా ఎండ దుప్పటి కప్పుకున్న
దిగంతాల దివ్వెలన్నీ
తిమిర సాగరంలో కార్తీక దీపాల్లా వెలుగు లీనుతూ
ఊహకందని ఊర్పులని
ప్రతి మనసులో లయం చేస్తున్నాయి
ఆనందపు కొలతలని కొత్తగా లిఖిస్తూ ...

కొన్ని దూరాల దగ్గరితనపు శబ్దాలని
మృదువైన వౌనాలుగా అనువదించుకుంటూ
సుషుప్తిలోకి నడచి వెళుతున్న నిరీక్షణగా అనంత ఆకాశపు రహస్యాన్ని
వెల్లడి చేస్తుందీ రాత్రి
మోక్షమంటే ఇదేనేమో ననిపిస్తూ....

- ఉమా నూతక్కి