సాహితి

అ అంటే అమ్మే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింపిరి తల
చిరిగిన బట్టలు
చావిట్లో విరిగిన నులక మంచం
ఏ గుడిసె చూసినా
ఏముంది గర్వకారణం?
ఎండిన డొక్కల్లో పొడి పొడిగా
రాలిపడే ఆకలి రజను తప్ప

అవిశ్రాంత జీవన సమరంలో
భరించలేని నిస్సత్తువుని
భవిష్యత్తుకి తాకట్టుపెట్టి
అంతే అలవాటుగా
శరీరాన్ని మూట కట్టుకుని
దొరగారి చేలచాళ్ళల్లో
దేహాన్ని దున్నించుకుని
పలుగూ పారా గాట్లతో
మనసుకి పడ్డ గాట్లతో
పొద్దు పుల్లల్ని విరిచి
చీకటి తాళ్ళతో బిగించి
తరలివచ్చే అడవి మందారం మా అమ్మ
చుట్టూ మొసళ్ళ గుంపులు
ఆపై నక్కల పలకరింపులు
చిరిగిన చీరెకు విశ్వరహస్యపు మాసికల్లో
అమ్మతనం నింపుకుని
చెరగని చిరునవ్వుతో ఆత్మవిశ్వాసాన్ని
తొడుక్కునే అమ్మని చూస్తుంటే
జీవితం చిమ్ముకొస్తున్నట్లు
చెమ్మ చెమ్మగా ప్రవహించటం కనిపిస్తుంది
ఆకలేస్తే సంకటిగా.. దాహమేస్తే నదిగా
మారే అమ్మంటే
ఒక నమ్మకం ఒక ధైర్యం
అమ్మంటే ఒక బతుకు పటం
అమ్మంటే వెలిగించిన దీపం

- లాస్యప్రియ కుప్పా 9640551664