సాహితి

సంఖ్యాబలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనొంటరినైనా సరే
నాకేమీ భయం లేదంటాను
నాకు నేను చాలుననుకుంటాను
అది ఉట్టిదేనేమో
మేకపోతు గాంభీర్యమేమో
వెనువెంటనే సర్దుకుంటాను
నాకు నేను చెప్పుకుంటాను
నేనే ఒక సైన్యమని
సేన ఎప్పుడూ బహువచనమే కదా

వాట్సాప్‌లో ముఖపుస్తకంలో
ఒక పోస్టు పెడతాను
ఎవ్వరూ ఇష్టపడకుంటే
నాకు నచ్చింది చాలని
లోలోన సర్దిచెప్పుకుంటాను
మిత్రులెక్కువ స్పందిస్తే
ఆనందపడతాను
ఎందరో లెక్కపెడతాను

ఒక్కడినీ కూర్చున్నప్పుడు
ఈ ప్రపంచమంతా
నా వెంటే ఉంది కదా
అని వారిలో నన్ను కలిపేసుకుంటాను
ఇంకొకరు తోడొచ్చినప్పుడు
రెండు పిడికిళ్లు
చాలునని సర్దుకుంటాను

ఈ సంఖ్యాబలంతో
అధికారాలే మారిపోతాయ్
ఆదర్శాలూ నిలబడతాయ్
ఆవేశాలూ రగులుతాయ్
ఆలోచనలూ సాగుతాయ్

ఒకటికన్నా రెండు
మూడింటికంటే నాలుగు
ఎప్పుడూ పెద్ద సంఖ్యలే
ఒంటిగాడికంటే సమూహం
ఎప్పుడూ పెద్దదే
ఎక్కడైనా విలువైనదే

సముద్రంలో పడేదాకా
చినుకు గొప్పదేం కాదు

- జంధ్యాల రఘుబాబు 9849753298