సాహితి

మనిషే అన్నింటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యశీలికి తలబరువు కాగల లేమి ఉన్నదా
అన్నింటా, ఆ అన్నింటా
దాటిపోతాము పిరికి బానిసలను
వీరికన్నా లేమియే మిన్న
అన్నింటా ఆ అన్నింటా
మన పాటుకేమి విలువ
పదవిదేమున్నది ఒక నాణేన ముద్దర
మనిషి అన్నింట బంగారము

ఇంటి తిండి తింటేనేమి మనం
ముతక బట్టలు కడితేనేమీ
ఇవ్వండి దద్దమ్మలకు పట్టుబట్టలు
యోధులకు వారి మదిర
అన్నింటా ఆ అన్నింటా మనిషే మేలు కొలత
వారి డాబుసరి వేషాలన్నింటా
నిజాయతీపరుడు నిరుపేదయతేనేమీ
తానే మనుషుల్లో మిన్న

ఉన్నాడడుగో దూరాన ఒక లోభి, దైవంగా
ఇటు అటు కాస్తూ, చూస్తూ
అనేకులకు తన మాట దివ్య శాసనం
కావడానికి తానో వెర్రి అయనా
అన్నింటా ఆ అన్నింటా
తన పతకాలూ, తారలూ, హోదాలూ
తన తెలివితో నడిచే లోక జ్ఞానికి
వీటిని చూస్తే నవ్వులే, అన్నింటా ఆ అన్నింటా

రాజు తలిస్తే చేయగలడు జోదును
రాజ వంశీకుడు, ఉప పాలకుడు
కానీ ఉత్తముడెన్నడూ మిన్న ఆర్భాటాల కన్నా
చిన్న వాటిపై ఉండదెన్నడూ తన విశ్వాసం
అన్నింటా అన్నింటా ఆ మర్యాదలన్నింటా
ఇంగితం, విలువ ఎరిగిన వర్తనకే
అన్నింటా మించిన ఉన్నత స్థానం

జోతలు చేద్దాం వచ్చేదేమైనా
వస్తుందెలాగూ కనుక
ఇంగితం, విలువ ఇల ఎల్లెడలా
వెల్లివిరియగా అన్నింటా అన్నింటా
వస్తున్నదో వేళ అన్నింటా
లోకమెల్లెడలా మనుషులెల్లరూ
అన్నదమ్ములై ఉండాలన్నింటా
- రాబర్ట్ బర్న్స్
(A man's man for all that) 1795
ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదం