సాహితి

గురజాడ ‘దేశభక్తి గీతం’ పునాది ఇదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’’ అన్న విశ్వమానవ సౌభ్రాతృత్వ గీతం ఒక్కటి మిగిలినా, గురజాడ ప్రపంచ మహాకవి అవుతారు అని శ్రీశ్రీ ఒక సందర్భంలో అన్నారు. అలాంటి దేశభక్తి గీతానికి పునాదులు వందేళ్ల ముందరి 1795 నాటి రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహాకవి గేయాల్లో దేశభక్తి గీతం పునాదులున్నాయి. గురజాడ, బర్న్స్ కవిని చదువుకున్న, ఇష్టపడిన, ఉటంకించిన ఆధారాలు 1910 తరువాతి గురజాడ వ్యాసాల్లో గమనిస్తాము. వీటిలో ‘‘మాటా - మంతి’’ పేరిట అచ్చులో ఒక పనె్నండుపైగా వ్యాసాలు లభ్యమవుతున్నాయి. నన్నయ గురించి చర్చ, తెలుగు కన్నడ భాషల మూలాలు, కొన్ని విమర్శలకు సమాధానాలు, ఒక బెంగాలీ నవల బంకిమ్ చంద్రుడి రచనకు తెలుగు అనువాదం పుస్తక సమీక్ష, వర్డ్స్‌వర్త్ నూతన యుగకారకునిగా సామాన్యులకు సాహిత్య ప్రాధాన్యత, ఇలా ఈ వ్యాసాల విషయ పరిశీలన చేస్తే.. సమయం ఉంటే, గురజాడ, ఇంకొన్ని వ్యాసాలద్వారా తప్పక కొత్త ఆలోచనలకు మరింత బలమైన ప్రాతిపదికలపై దారులు వేసుండేవారనిపిస్తుంది. ఈ సమయంలోనే 1910లో గురజాడ రాసి ఉంటారని భావిస్తున్న దేశభక్తి గీతం 1913 ఆగస్టు 9న కృష్ణాపత్రికలో అచ్చు అయింది. 1909 డిసెంబర్ తరువాత గురజాడ కన్యాశుల్కం సవరింపు పనులనుంచి బయటపడ్డారు. నాటకం రెండో ముద్రణగా విస్తృత రచనగా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాసాలు నవంబర్ 1910లో మొదలై, 1915 మార్చి వరకు కొనసాగిన ఆధారాలున్నాయి. వీటిలో రెండు వ్యాసాల్లో గురజాడ, రాబర్ట్ బర్న్స్ కవి చరణాలు ప్రస్తావన చేస్తారు. మొదటిది తనపై ఒక ఆకాశరామన్న ఉత్తరంలో చేసిన అభ్యంతరాలకు సమాధానం వ్యాసం. రెండోచోట, ఈ ప్రస్తావన వర్డ్స్‌వర్త్ కవిత్వం గురించిన చిన్న రచనలో వస్తుంది. రాబర్ట్ బర్న్స్ (1759-1796) స్కాట్‌లాండ్ దేశపు మహాకవి. తన మప్ఫైఆరేళ్ళ జీవితంలోనే వందలాదిగా స్కాటిష్ మాండలికంలో పాటలు, కవితలు రాశాడు. ఆ దేశపు జాతీయ కవిగా కీర్తివంతుడు. చాలా దశాబ్దాలుగా ఈయన జయంతి స్కాట్లాండ్‌లో జాతీయోత్సవాల సందర్భంలో గురజాడ ఉటంకింపులు ఇవి.
"O would some powers the gift give us
to see ourselves as others see us
(from the poem To a Louse, 1786)
"The rank is but the guinea stamp
Man is the gold for all that
(from the poem / song A man's a Man for A' that (1795)

బర్న్స్ కవిని గురజాడ చదవడమేకాక, తన వ్యాసాల్లో ప్రస్తావించారు. 1910లో మొదలుపెట్టిన ముత్యాల సరాలు రాస్తున్న కాలం కూడా ఇదే. కవిత్వ సరళత ముత్యాల సరాలలోని సహజాభరణం, టిట పోకడ, అంతర్జాతీయ సాహిత్య పరిణామంగా, అలాగే అలాంటి అలి పదాలతో, పల్లీయ స్కాటిష్ పదాలతో, బర్న్స్‌రాసిన వందలాది పాటలు కూడా గురజాడ దృష్టిలో ఉన్నాయి. ఇతరులపట్ల సహనంతో ఉండాలని మనకు భారత కాలపు నీతి ఉన్నది. ‘‘ఒరులేయవి యొనరిచిన నరవర! యప్రియము తన మనంబునకగు తా నొరులకవి సేయకునికియె పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్’’. బర్న్స్ కవి ఒక అడుగు ముందుకెళ్లి ‘‘మనలను ఇతరులు ఎలా చూస్తారో అలా మనమే చూసుకోగల ఏ శక్తి అయినా ప్రసాదిస్తే బాగుణ్ణు’’ అన్నాడు. ఇది గురజాడ మొదట ఉటంకించి, తన వ్యాసం మొదలుపెట్టాడు.
రెండో కవిత ‘ఎ మేన్ ఈజ్ మేన్ ఫర్ ఆల్ దట్’- అనేది ‘ఆల్ దట్ అండ్ ఆల్ దట్’ అనే వరుసలో పెడతారు. ఇదొక సుప్రసిద్ధ గేయం. స్కాట్లాండ్ పార్లమెంట్ మొదలుకుని, వివిధ కళాకారులు బృందాలుగా, గానం చేయడం, సంగీత పరికరాలపై వాదనం, చివరికి రాప్ సంగీతంగా కూడా యూరప్ అంతా బహుళ ప్రజాదరణ పొందిన రచన ఇది. ఒకసారి 1999లో స్కాట్‌లాండ్ పార్లమెంట్‌లో ఒక మహిళా సభ్యురాలు పాడగా, మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ గొంతు కలిపి పాడినది ఒక ఉత్తేజకరమూ, స్ఫూర్తిదాయకమూ అయిన సన్నివేశం. ఇపుడు మనం సామాజిక మాధ్యమాల్లో చూడొచ్చు. బర్న్స్ కవి రాసిన ఈ గేయం ‘‘మనిషి ఉత్కృష్టత తన సత్యసాధనలో, నిజాయితీలో ఉన్నది తప్ప వేరే అధికారాలు, పదవులూ ఆర్భాటాల్లో లేదు’’ అని తెలిపే ప్రపంచ విశాలత్వ గీతం. ఈయన కూడా ఎక్కడా, ఒక దేశం, ఒక ప్రాంతం మాట ఈ రచనలో ప్రస్తావన చేయలేదు. ఇది గురజాడకు కూడా స్ఫూర్తి.
మానవుల ప్రగతి, నూతన సమాన విలువలూ, సంఘంలో ఉన్నతంగా భాసించే సర్వసామాన్య ప్రజానీకపు పాత్రను గుర్తిస్తూ, పాటలు కట్టి పాడినవారు రాబర్ట్ బర్న్స్ వంటి తొలి తరాల కవి పుంగవులు. అటు తరువాత వర్డ్స్‌వర్త్ (1770-1850) కూడా ఒక గొల్లపిల్లవాడి జీవితం (మైఖేల్ రచనాకాలం 1800) ఒక కావ్యంగా రాశారు. వర్డ్స్ వర్త్ గురించి తన చిన్న వ్యాసంలో గురజాడ ప్రస్తావించిన ఇతివృత్త ప్రజాస్వామికత అదే. ఈ ‘ఎ మేన్ ఈజ్ ఎ మేన్ ఫర్ ఆల్ దట్’ అనే కవిత స్కాట్‌లాండ్ సాహిత్యంలో సుప్రసిద్ధ ప్రజాస్వామిక రాజకీయ గీతంగా ప్రఖ్యాతి పొందింది.
ప్రజాస్వామ్యవాదులకు శిరోధార్యంగా, ఈ రెండు వందలేళ్లుగా, ఆ సమాజంలో స్వేచ్ఛా మానవ చైతన్య సంగీత జ్వాల, ఈ గీతం. సామాన్యుడి కోసం మాట్లాడుతూ, హోదాలు, అధికారాలను ప్రశ్నిస్తూ, విశ్వసోదరత్వ భావనకు ఈ రచనలో బర్న్స్ దారులు వేశాడు. ఈ రచన గురించి చెప్తూ బర్న్స్, ఒకటి రెండు ఆలోచనలు వచన రూపంలో ఉన్నవి, పాటగా మలిచాను అని తెలిపాడు. అలెగ్జాండర్ పోప్ (1688-1744) తన రచనల్లో ‘‘నిజాయితీపరుడైన మనిషి, భగవంతుడి ఉత్తమ సృష్టి’’ అని రాసి వెళ్లిపోయాడు అప్పటికే. 1791-92 కాలంలో థామస్ పైస్ (1737-1809) ‘ఫెంచ్ విప్లవం తర్వాత (1789-1799) సైనిక దర్పాల నీతి రిబ్బన్ల, మోడళ్ల హోదాల గురించి మాట్లాడే పసితనం వెళ్లిపోయింది. ఫ్రాన్స్ ఈ ఆర్భాటాలను పక్కకు తోసేసి, పరిణతి మానవ దశకు ఎదిగింది. కౌంట్‌లు, డ్యూక్‌ల కాలం చెల్లింది. ఇక మరుగుజ్జులను పక్కనపెట్టి, నిండు మానవుడికి ఫ్రాన్స్ వేదికగా మారింది. మనకు కనిపిస్తున్న యూరప్ అంతా ఒక రిపబ్లిక్ అవుతుంది. మనుషులు స్వతంత్రులౌతారు అని ఆశాభావన వ్యక్తపరిచాడు. 1795కు తన పాటల్లో ‘మనిషే అన్నింటా’ అని బర్న్స్ కవి మాట్లాడుతున్న స్వేచ్ఛా సమాజ మానవుడు ఈ నేపథ్యం నుంచే వచ్చాడు. పద్ధెనిమిదో శతాబ్దం మధ్యకాలం నుంచి ఈ గీతం యూరప్ దేశాల్లో ప్రఖ్యాతంగా పాడుతున్నారు. ఈ గీతంతో గురజాడకు పరిచయం ఉన్నది. తన వ్యాసాల్లో బర్న్స్ కవిని రెండుసార్లు ఉటంకించిన గురజాడ, సరిగ్గా ‘ఏ మేన్ ఈజ్ మేన్ ఫర్ ఆల్ దట్’ గీతం నుంచే. మానవ ఉత్కృష్టత గురించి బర్న్స్ రాసిన చరణం రెండో ఉటంకింపు చేస్తూ, గురజాడ, తెలుగు అనువాదం కూడా చెప్పారు ఈ లఘు వ్యాస రచనలో.
‘దేశభక్తి గీతం’లో గురజాడ చెప్పిన మన పంటల సత్తువతో తిండి, కండ కలగడం, దుస్తులలో స్వదేశియత, పరుల కలిమిని చూసి పొర్లి ఏడ్వడం పట్ల నిరసన, శ్రమ మీద నిర్మాణం అయ్యే సమాజం, వాణిజ్య ఉధృతి, వీటికి మూలకందమైన మానవుడు, బర్న్స్ గీతం ‘ఏ మేన్ ఈజ్ ఎ మేన్ ఫర్ ఆల్ దట్’ (మనిషే అన్నింటా)లో స్పష్టంగా కనిపిస్తాడు. బర్న్స్ గీతంలో కూడా ఎక్కడా, నదులు, పర్వతాలు, ప్రాంతాలు, జాతుల గొప్పతనాలు లేవు. గురజాడ గీతం కూడా ఇదే ధర్మాన్ని పాటించడం చూస్తాము. ‘‘జాతమన్నది లేచి పెరిగిన లోకమున రాణించునోయి’’ అని దేశభక్తి గీతం పనె్నండో చరణంలో అన్నపుడు ‘్దళ ఘూశరీ జఒ ఇఖఆ ఆ్దళ ఖజశళ్ఘ ఒఆ్ఘౄఔ ఘశ జఒ ఆ్దళ యజూ ఛ్యి ఆ్ద్ఘఆ’’ (చ్యిౄ ఆ్దళ ఔ్యళౄ / ఒ్యశ ఘశ’ఒ ఘశ ఛ్యి ’ ఆ్ద్ఘఆ (1795) అన్నది చాలా బలంగా కవిత్వీకరించాడు. గురజాడ, తాను ఈ గీతాన్ని నూరేళ్ళ తరువాత రాస్తున్న 1910 దశకపు వర్తమానంలో బలంగా ప్రతిష్ఠాపిస్తూ, బర్న్స్ కవి భావనలపై ఈ గీతపు భవంతి నిర్మించాడు. దేశభక్తి గీతం పదకొండో చరణంలో ‘‘చెట్టాపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి’’ అని రాస్తున్నపుడు గురజాడ మనసులో, బర్న్స్ కవి 1796లో రాసిన గీతపు ముగింపు పంక్తుల చరణం- ‘్ద్ఘఆ ఘశ ఆ్య ఘశ, ఆ్దళ త్యీజూ య’ళూ, డ్ద్ఘ ఇ్యఆ్దళూఒ ఇళ చ్యి ఘ ఆ్ద్ఘఆ’’ ఉన్నదనేది పరిశీలనకు అందుతుంది. గురజాడ తన రచనలకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయో చెప్పారు. యోగవాశిష్టంలోని లవణరాజు కల వృత్తాంతం, ఆమన్ పితియస్ ఒక గ్రీక్ కథ కన్యక, పశ్చిమ గోదావరి ప్రాంత పెనుగొండలో జరిగిన ఐతిహ్యం, పూర్ణమ్మ బాల్య వివాహాల చెడు పరిణామాల గురించిన ఒక కవితాత్మక నివేదిక. ముత్యాల సారాలు పేరు గల గురజాడ తొలి గెటమే- తన బరంపురం (సహపంక్తి) బంతి భోజనాలకు, ఇంకా అక్కడ సభల్లో చోటుచేసుకున్న వైజ్ఞానిక సాహిత్య విషయాల చర్చలకు వెళ్లి వస్తూ, రోదసీ బంధువైన హేలీ తోకచుక్క గూర్చి శాస్ర్తియ హేతుబుద్ధితో కవిత చెప్పిన ఒక వాస్తవ ఆధారిత సృజన.
గురజాడ, యూరప్ పాశ్చాత్య సాహిత్య లోకాన్ని తన స్వేచ్ఛాగానంతో ఒక ఊపు ఊపిన రాబర్ట్ బర్న్స్ కవిని చదువుకున్న ఆధారాలు, తన రచనల్లో ఉండటం, వారి రచనా పద్ధతులు, ఆలోచనలపట్ల గురజాడ ఆదరణ, గౌరవం ఉండటం, అటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనలను తాను కూడా, ఇతరులెవరూ తెలుగు సాహిత్యంలో చెప్పని విధంగా చెప్పేందుకు పూనుకుని సఫలీకృతుడు కావడం, వీటికి గురజాడ రచనకు వందేళ్లకు ముందరే వెలువడ్డ గీతం నుంచి తాను ప్రభావితుడు కావడం, ఇవన్నీ వ్యాసాల్లో బర్న్స్ కవి గురించి గురజాడ ఇచ్చిన ఆధారాలను గ్రహిస్తే విశదమవుతాయి.
వెరసి గురజాడ 1910 దేశభక్తి గీతం సారంలో ‘ఎ మేన్ ఈజ్ ఎ మేన్ ఫర్ ఆల్ దట్’ అన్న రాబర్ట్ బర్న్స్ కవి 1795 గీతంతో స్ఫూర్తిదాయక సమధర్మాన్ని కలిగి ఉన్నది. తన కాలానికి, ఇంతగా అంతర్జాతీయ రచయితలను, మేలిమి రచనలను గురజాడలా చదువుకున్న ఎరుకతో సార్థక రచన చేసినవారు, తనకన్నా పెద్దవారైన వీరేశలింగం, సమకాలికుడైన గిడుగు రామమూర్తి ఉండటం కూడా తెలుగువారి అదృష్టం. అందుకే, ఈ రచనల స్వభావం, వేరువేరు స్వరూపాల్లో మానవ శ్రేష్ఠత కోరే సారభూత సంపదలుగా తరువాత దశాబ్దాల్లో శ్రీశ్రీ ‘మానవుడా’ గీతం రాసినా, ‘నయాగరా’ కవుల జలపాత హోరు ముంచెత్తినా, తమ ‘త్వమేవాహం’లో మానవుడ్ని సమాజ నిర్మాతగా ఆరుద్ర ఒక విప్లవకర సన్నివేశంలో పొదిగినా, విప్లవ భావన అనేది మానవుల చేతిలో ‘వజ్రాయుధం’గా తెలంగాణ విముక్తి పోరాట నేపథ్యంలో వచ్చిన కావ్యంలో సోమసుందర్ చెప్పినా, ఇదే కాలంలో హైదరాబాద్ స్టేట్‌లో పలు కడగండ్లు ఎదుర్కొన్న దాశరధి ‘అగ్నివీణ’గా వివిధ గీతాల్లో పలికినా, ‘కులమతాల గోడలకు కట్టుపడను నేను, నేను విశ్వనరుడిని’ అని జాషువా ఖండకావ్యాల్లో ప్రకటించినా, ‘విశ్వంభర’లో మానవ ప్రస్తావన, విజయ ప్రశస్తి నారాయణరెడ్డి చేసినా, ‘మానవుడే మహనీయుడు’ అని ఆరుద్ర ఒక సినీ గేయ సందర్భంలో రాసినా, ‘నేనంతా పిడికెడు మట్టే కావచ్చు, కానీ తల ఎత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’ అంటూ అభివ్యక్తికి అజంతా చిత్రమైనవాడూ, జ్ఞానసంపన్నుడు శేషేంద్ర శర్మ రాసినా, వీటి వేళ్లు బలంగా, ఖండాంతర వాహినులుగా, శతాబ్దాల పురాతన స్రోతస్వినులుగా రాబర్ట్ బర్న్స్‌ను అందుకున్న గురజాడ మీదుగా, తెలుగు నాట అక్షర సాక్షాత్కారమయ్యాయి. అందుకే వీరు సమాజ సంపదగా, ఏ దేశం వారైనా, లోకానికంతటికీ ప్రాతః స్మరణీయులు. రేపటి మానవ సమానత్వ సమాజపు ఆశల కాగడాలు.

- రామతీర్థ, 9849200385