సాహితి

నడివయసు ప్రణయ కాంక్ష- నడచివచ్చిన సదవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెళ్లాముతో కాపురము చేసేటప్పుడు ఆయన ఒక్క రోజు భార్యతో కలిసిమెలిసి లేడు. ఎప్పుడూ పెళ్లాన్ని కొట్టడమో, తిట్టడమో! అంతేకాని చిలకా గోరువంకలాగా వుండేవాళ్లుకారు. ఏమో అన్యోన్యము లేదని చెప్పితే వాళ్లకిద్దరు పిల్లలు ఎలా కలిగారు? అదో గాలిపాటు!
ఇలాంటి దంపతులు ఎందరో వుంటారు. సంసారంలో సామరస్యం లేకపోయినా దైహిక అవసరాలకోసం కాపురాలు నడుస్తూ వుంటాయి. ఇలాంటి భర్త ఒకాయనకు ముప్ఫై రెండో ఏట భార్య పోయింది. అప్పుడే మూడేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు పెద్దవాడికి పనె్నండు సంవత్సరాలు, రెండో పిల్లవాడికి తొమ్మిది సంవత్సరాలు.
శ్రీ చింతా దీక్షితులుగారి కథ ‘రైలు బండిలో ప్రేమ’ అనే కధానికలో యిదీ వాతావరణం. దీక్షితులుగారి పేరు తలుచుకోగానే- ‘కటీరావు కథలు’ గుర్తుకు వస్తాయి. బాల సాహిత్యంలో పాటలు వెనకటికి వస్తాయి. బాల వాజ్మయ బ్రహ్మ, కథక చక్రవర్తి వంటి బిరుదులు సంతరించుకున్న వీరు ఆధునిక కథా సాహిత్యం తెలుగులో 1910లో ప్రారంభం అయింది అనుకుంటే- తరువాత దశాబ్దంలో విరివిగా రచనలు చేసి ప్రజాదరణ పొందారు. వీరి ‘లక్క పిడతలు’ కేవలం గేయమే క ఆదు, కథలు కూడా అటువంటివే. త్యీౄళశఒ ళ్ఘౄశషజఔ్ఘఆజ్యశ స్ర్తిజనోద్ధరణను ప్రయోగంగా కథలు వ్రాసినారు. స్త్ర విషయంలో ‘చలం’ దారి వేరు, వీరి దారి వేరు. చలం- మునిమాణ్యం- దీక్షితులు వీరు ముగ్గురూ స్ర్తి హృదయాన్ని అర్థం చేసుకుని పల్లవించిన పథాలు మూడు దారులలో నడుస్తాయి. అప్పటి సాంఘిక ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని వీటిని సమీకరణం చేయవలసి వుంటుంది. కథలోనికి వస్తే, ఆ నడి వయసు మనిషి ‘ద్వితీయం’ చేసుకోవలసిన స్థితిని బంధువులు ఆమోదించలేదు. ‘అతనికి భూములున్నాయా, చదువులున్నాయా ఎవరైనా పిల్లను ఇవ్వటానికైనా!’ అని రచయిత తాళం వేస్తారు. అయినా అటువంటి మనిషి రైలు ప్రయాణ చేస్తూ ఒక ‘విశ్వస్య’ను చూచి ఆకర్షితుడవుతాడు. రైలు ప్రయాణంలో రకరకాల మనుషులు తారసపడతారు. వారిని రచయిత వర్ణించే పద్ధతి కూడా బహు యోగ్యంగా ఉంటుంది. ‘సన్న గ్లాస్కో అద్దకపు చీర ధరించి, మోచేతులు దాటివచ్చు జాకెట్లు తొడిగి, రెండు పాళ్ల పిన్నులను గుచ్చి, సన్నని బంగారు గాజుల జత ముంజేతుల కలంకార మగునట్లు చేసి, నిష్కలంక వదన బింబముతో వెన్నారుతూ నవనాగరికత విద్యార్థి తడవ తడవకూ వలపు క్రీగంటి చూపులు తన పైబడినవని యెరింగియు, ఎరగనట్లు భ్రమించజేయుతూ, కిరస్తానీ సోదరీమణులను తలపునకు దెచ్చు నాగలీక ప్రౌఢ వితంతు వొకటి-
ఇదీ వర్ణన
ఈమె దృష్టిని ఆకర్షించడంకోసం అప్పారావు (కథకుకడి పిలిచే వ్యక్తి పేరు ఇది) పద్య పఠనం చేస్తాడు. రైలు పొడుగునా ఆమె చర్లన గమనిస్తూ వుంటాడు. ఆమె రాజమహేంద్రవరం స్టేషన్‌లో దిగిపోతూ వుండగా- తన టిక్కెట్టు ఏలూరు వరకూ వున్నా ఖాతరు చేయకుండా అప్పారావు కూడా రైలునుంచి అమాంతం కిందికి దిగిపోతాడు. ఆమె సామానుపెట్టె బయటకు తనే లాగి ప్లాట్‌ఫాంమీద కూలీని కూడా ఏర్పాటుచేస్తాడు.
ఆమెకు ‘నాళంవారి సత్రానికి’ బండి కట్టిస్తాడు. ఈ బండి ప్రయాణంలోనే ఆమెతో చనువుగా మాటాలడి ఆమె కథను అంతా తెలుసుకుంటాడు. ‘తలుచుకుంటే దుఃఖం చేటు! నమ్ముతారో లేదో కాని సరిగ్గా అచ్చంగా మీ రూపమే. అది బతికి వుంటే ఇన్ని పాట్లు నాకెందుకు సంభవిస్తాయి’ అని నిట్టూరుస్తూ తన గోడు చెప్పుకుంటాడు. ఆమె తన వర్తమాన స్థితి తెలుసుకున్న తరువాత అతనికి కొంత ఊరట కలిగినట్లు అయింది. ఆమెను ‘సుబ్బారాయుడు’ అనేవాడు పెళ్లి చేసుకుంటానని, తీరా చివరి క్షణంలో అందుకు అనుకూలమయిన పరిస్థితులు లేవని ఆమెకు అయిదు రూపాయలు పంపి రాజమండ్రి వెళ్లమని ఉత్తరం వ్రాస్తాడు. అదీ ఆమె ఇక్కడకు రావడానికి కారణం. ‘ఇక నన్ను చూసేవారెవరు? ఏకాకినై ఇలా తిరగవలసిందే.. నా బతుకు ఇలా అయిపోయింది’ అంటూ ఆమె (నర్సాంబి ఆమె పేరు) విలపిస్తూ వుంటే, అప్పారావు ధైర్యం కూడగట్టుకుని ‘మీరు విచారించకండి. ఏకాకిగా వుండవలసిన కర్మ ఏమిటి, నేను బతికి వుండగా! మీకు అభ్యంతరం లేకపోతే.. అంటాడు. తన చదువు, సాహిత్యం, వ్యాపారం చేయాలనే పూనిక ఎరుక పరుస్తాడు. అంత దుఃఖంలోనూ, నర్సాంబను నవ్వించి సత్రంలో ఒకే గదిలో ఉండి ఆమెతో వివాహ ఒప్పందం కుదుర్చుకుంటాడు. అప్పారావు మళ్లీ తన వూరు కాకినాడ వెళ్లి పిల్లవాళ్లకు తగు ఏర్పాట్లు చేసి వాళ్లను ఊరడించి తిరిగి రాజమండ్రి చేరుకున్నాడు. వాళ్ళు ముందుగా నిర్ణయించుకున్నట్లు, అప్పారావు-నర్సాంబలకు రాజమహేంద్రవరం తోటలో పెళ్లి జరిగింది. ఇద్దరు కొత్త దుస్తులు ధరించి ‘మహదాశీర్వచనం’ అందుకున్నారు. ఎలాగైతేనేమి వొక పెళ్లి జరిగినది. కాదు.. రెండు కుటుంబాలు నిలబడ్డవి అని కథను ముగింపు చేస్తాడు. వీరేశలింగంగారి ప్రసక్తి కధలో రాకపోయినా, వివాహం రాజమండ్రిలో జరగడం- అందుకు వితంతు పునర్వివాహం అవడంవల్ల ఈ కథకు వారి అభిప్రాయాల అనుకూలత, ఆచరణ స్పష్టం. సాంఘిక సంస్కణకు సాక్ష్యంగా నిలిచే కథ ఇది.

- శ్రీవిరించి, 09444963584