సాహితి

జంట పక్షులమై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన మాటల చూపులు
మొదటిసారి కలిసినప్పుడే
నీ రెక్కల్ని చూశాను
ముడుచుకుని
భయంభయంగా సర్దుకుంటూండగా
అస్తిత్వాన్ని దాచుకోలేక
సంకోచంగా అటూ ఇటూ కదులుతుండగా..

ఎగిరే వాంఛని
ఈకలుగా మొలిపించుకొన్న రెక్కలు
ఎంతందమైనవి!
ఎంత శక్తి దాగుంది వాటిలో!

ప్రియమైన పాలపిట్టా
సందేహించకు
రెక్కల్ని విప్పారనివ్వు

చిటికెన వేలు పట్టుకుని నేనొచ్చిందీ
నీ రెక్కల్ని కత్తిరించడానిక్కాదు
నీతో కలిసి ఎగరడానికి.

- నవీన్‌కుమార్ 9951979399