సాహితి

జ్ఞాపకాల పుటల్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ తోటలో విరబూసిన ఓ గులాబీవి
అక్షరం విత్తుని భూమి పుస్తకంలో నాటిన
అసలు సిసలైన రైతువి
మట్టిని బంగారంగా మలిచిన
ఓ అరుదైన కవిత్వ శిఖరానివి
ప్రేమకు కొత్త రంగులు అద్దిన
ప్రేమైకమూర్తివి
ఏ దారిన ఎటు పయనిస్తావో
ఊహించడం కష్టమే
ఈ క్షణాన కులమతాలు రూపుమాపే
సంఘ సేవకుడివి
మరు నిముషాన పశుపక్ష్యాదుల కోసం
తాపత్రయపడే జాలి కెరటానివి
ఏది చూసినా ఏది రాసినా
అగాధాల అంచులను త్రవ్వటమే
ఆకాశం అంతు కొలవటమే
అయస్కాంతానికి ఇనుము చిక్కినట్లు
ఆ కవిత్వసీమలో విహరించాల్సిందే
అందరూ చెయ్యలేని పని
అది మీకే చెల్లు శేషేంద్రా
అది మీకే సొంతం కవిశేఖరా
- యలమర్తి అనూరాధ,
9247260206