సాహితి

ప్రతి చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సంఘటన
అంతులేనంత విషాదాన్ని రేపి
జీవనానే్న ప్రశ్నించినప్పుడు
అశృబాష్పమై కరగడం
ఆవేశమై జ్వలించడం
మానవత్వం.

జరిగిన ప్రతిచర్యతో పాటూ
ఆ ప్రతిచర్య వెనుక నిగూఢంగా దాగిన
చర్యని చూడలేకపోవడం
అనుభవ రాహిత్యం,
అసంపూర్ణ వ్యక్తిత్వం.

చర్యల్ని చూడలేని ముసుగు కళ్ళతో
ఒక కోణాన్ని మాత్రమే పట్టుకుని
అసంపూర్ణ అక్షర భావాల్ని వెదజల్లి
కుల మత జాతి లింగ వర్ణ వర్గ భేదాల
అసమానత్వాలకు తోడు
పక్కవాడి భావాల్ని కించపరిచి
తమకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదనే
కలాలు కూడా ఒక జాతిగా మారితే
ఆ జాతి మానవత్వంతో పాటు
కలాలు కూడా కుంచించుకుపోతాయ.

- బి. గీతిక, 77202600583