సాహితి

జవాబులు లేవా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెమేరా లాంటిదా
కవిత్వం
ఎవరెన్ని ఫొటోలు తీసినా
అన్నీ వేరు వేరు

కళ్ల తలుపుల్ని మూసేస్తే
కలల కిటికీలు తెరుచుకుంటున్నాయ
కాంతి వేగంతో కలలొచ్చి పోతాయా
అడవిలోలా ఏ చెట్టూ
నగరంలో పెరగటానికి లేదు
అక్కడ అన్నింటికీ
ఒక పరిధి ఉంటుందన్నది తెలీదా

ఇళ్లల్లో కలప అంతా
ఒకప్పటి అడవిలో
ఎన్ని చెట్ల మాంసపు కండలో

ఎందరి పూర్వీకుల పునాది
ఈ ప్రపంచం

నిశ్శబ్దానిది ఏ భాష
గాలిది ఏ రంగు

తన పక్క ఏమిటో నదికి తెలుసా
సాలెగూడు ఎలా వస్తుందో
సాలెపురుగుకి తెలుసా
తనమీద చిత్రం ఏమిటో
కేన్వాసుకు తెలుసా

తన చివరి శ్వాస ఎప్పుడో
ఏ జీవరాశికైనా తెలుసా
*
- ముకుంద రామారావు
9908347273