సాహితి

కాల ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాగత ఝరులు
శుభాకాంక్షల వెల్లువలు
సంతోషపు అలల వేడుకల వేగాలు
ఈ యేటికి ఉత్సాహం తెచ్చాయ
సంబరం అంబరాన్నంటినా
పాతదే కొత్తదయంది, ప్రవాహం ఒకటే
కాళ్లకు తడారని కదలని శిలగా చూస్తూనే ఉన్నా
కొత్తొక వింతయనా అది పాతదవ్వాల్సిందే
కొత్తయనా పాతయనా అది ప్రవాహమే కదా!
పగళ్లూ, రాత్రులూ, వారాలూ, నెలలూ
ప్రవాహానికి కొట్టుకుపోతూనే ఉన్నాయ
కొన్ని కెరటాలకు రక్తపు మరకలు
కొన్నింటిని అవినీతి నురగలు
కొన్ని కాలుష్యపు ప్రతిబంధకాలు
కొన్ని అమానుష సుడులు
మానవత్వం కూడా కరిగిపోతోందిలా, ప్రవాహంలో!
కొన్ని విజయాల వీచికలు
మానవత్వపు లేత పరిమళాలు
ఆశల సమీరాలు
భవిష్యత్ సంతోష పత్రంపై
హామీ సంతకం చేస్తున్నాయ
ఈ ప్రవాహపు కాలచక్రానికి ఎదురీదడం సాధ్యమా?
కాలంతో పాటు కదులుతూ
విజయాల ముద్రలను మానవత్వపు పరిమళాలతో
ప్రవాహానికి శోభను కలిగిస్తూ
హుందాగా ముందుకు సాగడమే!
*
- చావలి శేషాద్రి సోమయాజులు