సాహితి

రగ్గులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ గుర్తే
అవును నాకన్నీ గుర్తే
హేమంతపు ప్రభాతాన
వణికించు చలిలో రగ్గుల నడకలు
ప్రయవేటుకు రగ్గుతో నేను
అమ్మపాలు పితకడానికి
త్రోవలో నాతోబాటు
నా చుట్టూ ఎన్నో రగ్గులు
కొన్ని పొలానికి
కొన్ని పాల కేంద్రానికి
కొన్ని చలిమంటల చెంతన
కోళ్ళ దగ్గర పిండి దంచుతూ కొన్ని
చెరువుకు నీళ్ల్లకి కావిళ్ళతో కొన్ని
కల్లాపి చల్లుతూ కొన్ని
ముగ్గులు వేయుచూ కొన్ని
హరినామ సంకీర్తనలతో కొన్ని
కాటికాపరి వేషాలతో కొన్ని
రచ్చబండన పొగలొదులుతూ కొన్ని
చుట్టూ రగ్గుల నడకలే
పచ్చని పొలాలేమో చిరుముత్యపు
తుషారపు రగ్గు కౌగిటన
ఉషోదయం సఖుని కొనిపోవునేమో
యని కించిత్ విరహ వేదన!

- రవికిషోర్ పెంట్రాల, లండన్, 07703327908