సాహితి

గొబ్బెమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గులు దిద్దిన
ముంగిళులందున
ముచ్చటలాడే గొబ్బెమ్మా! మా
పచ్చని తల్లీ! గొబ్బెమ్మా! ...ము

నవ భావములను
అనురాగములను
నారు వోసినా గొబ్బెమ్మా! మా
నవ్వుల తల్లీ! గొబ్బెమ్మా! ...ము

రంగు రంగులా
రంగవల్లులను
కొంగున దెచ్చిన గొబ్బెమ్మా! మా
కోర్కెల తల్లీ! గొబ్బెమ్మా ...ము

హరి హరలొ రంగ
హరి హరి యను దా
సరి కీర్తనలతొ గొబ్బెమ్మా! మా
పురమున కొచ్చిన గొబ్బెమ్మా ...ము

బొమ్మల కొలువుల
కమ్మని పాటల
గ్రుమ్మరించితివి గొబ్బెమ్మా! మా
అమ్మవు నీవే! గొబ్బెమ్మా ...ము

- స్వర్గీయ మడిపగడ బలరామాచార్య
(40 ఏళ్ల క్రితం రాసినవి)