సాహితి

ఆనంద శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుక్కల అంబరాన్ని తొడిగిన
వినీలాకాశం మిణుగురులై తళుకులీనగ
లేలేత చిగురు దారాల
అల్లికలుగ నేసిన ఆకుపచ్చని
చీరకట్టిన ప్రకృతి కాంత
మందస్మిత మందగమన
మలయమారుత అతి శీతలములకు
సోయగాలు పోగ
సప్తవర్ణ సొబగులద్దుకున్న
లతాంతికలు గాలి అలలుగా
సౌరభాలు వెదజల్లగ
తెలుగు మాగాణి
పసిడి ధాన్యరాశిగ మారగ
పక్షుల కిలకిలారావములై
మత్తకోకిల తీయని రాగమాలపించి
పౌష్యలక్ష్మిని స్వాగతించే
మంచుదుప్పటి కప్పుకున్న
పుడమి తల్లి ఉషోదయాన
అరుణ కిరణ నునువెచ్చని స్పర్శగా
తరుణుల కరములుగ
జాలువారిన ముత్యాలముగ్గులు
హరివిల్లై విరబూసె అవనిపై
అటు ఆకాశ దీపాలైన గాలిపటాలు
ఇంద్రచాపాన్ని తలపించే అంబరాన
సన్నాయ వాయద్యములుగ
డూడూ బసవన్నల
మూపుర సింగారము
గంటానాదములై
పరమశివుని ఆగమన
సూచకములవగ
తెలుగు లోగిళ్ళు
సత్యం శివం సుందరములుగ
ఆనంద నిలయాలై
సంక్రాంతి శోభ అవతరించె

- మడిపల్లి హరిహరనాథ్, 9603577655