సాహితి

సంకురాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగణాల ఆపాదమస్తకం
ఆవరించిన మంచుదుప్పట్లను
చీల్చుకుంటూ వచ్చాయ
సంక్రాంతి సముజ్వల క్రాంతిరేఖలు

భోగిమంటలతో భోగభాగ్యాలతో
కొత్త అల్లుళ్లతో కొంగ్రొత్త ఆశలతో
సంతసాల మేళవింపుతో
సౌరభాల గొబ్బిళ్ళతో
కోడిపుంజుల పందేలపట్లతో
జనాలను పరవళ్ల జల్లులలో
ముంచెత్తటానికి నడుం బిగించి
నట్టింట నిలిచింది నవనవలాడే
నవ్యక్రాంతి అదేనండి సంకురాత్రి..

నివాసాలన్నీ నిగనిగలాడగ
పాడిపంటలతో పొంగుతుండగ
రైతుల కంట ఆనందబాష్పాలు
తాండవించుచుండగ
రమణీయంగా ప్రకృతి పరవశించుచుండగ
ఆనంద హేలతో అడుగు మోపింది
ఉషోదయ శుభోదయాల సంకురాత్రి

సంక్రాంతి సంబరాలలో
సంలీనమవుదాం
సబ్బండ వర్గాల మోములో
శరచ్చంద్రికల మవుదాం

- బాదేపల్లి వెంకటయ్యగౌడ్, 9948508939