సాహితి
అమ్మతనం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 28 January 2018

నలుగుతున్న పద్యంలా
మబ్బులు పట్టిన ఆకాశం
ఒట్టి ఉరుములకూ మెరుపులకూ
నేల దాహం చల్లారదు!
అక్కరకు రాని అక్షరాలు
నిత్యం లక్ష జల్లినా
కాగితం ఒంటికి
కావ్య సుగంధమంటదు!
చెట్టు పిలవనిదే
వానపిట్టయి వాలదు
హృదయమింత ద్రవించనిదే
శోకం శ్లోకంగా మారదు!
నేల చదును చేయకుండా
వర్షం కోసం ఎదురుచూడకు
మొలవని విత్తులు జల్లి జాతికి
పంటల్ని వాగ్దానం చేయకు!
కవికొకింత అమ్మతనం తెలియనిదే
ఆకలి రహస్యాలు అక్షరాలు పొదగవు
వాన కురవనట్లే నువ్వెంత గింజుకున్నా
పిడికెడు కవిత్వం రాలిపడదు!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి