Others

వినువీధిలో విశ్వనరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో ఒక రాత్రివేళ నింగిలోకి తొంగిచూడండి
దిక్కులను వెలిగిస్తూ గగనమెక్కిన చుక్కల్లో
ధిక్కార దీపమై కనబడతాడు కవికోకిల.
శ్మశానాలు దాటి సమానత్వం సమాజాన్ని చేరనే లేదని
కాటిసీను కంటికి చూపిస్తూ అంతరంగస్థల పద్యమై
రాత్రింబవళ్ళు వినబడతాడు కవి దిగ్గజుడు.
కలాన్ని నిత్యం వెంటాడిన కులం
గుండెలోపల బాకుతో గుచ్చినప్పుడు
నిప్పురవ్వలు రాల్చి నిరసన స్వరమవుతాడు కవి
బుసకొట్టే నాలుగు పడగల నాగరాజుని
కసితీరా కరుణ రసం జల్లి నాశనమవమని శపిస్తాడు
చచ్చిన పేదవాడు కడసారి విదిల్చిన కంటినీటిలో
వెచ్చదనాన్ని చూసి హెచ్చరికలు చేస్తాడు
తాజ్‌మహల్ మొహం మీద ముంతాజ్ మొహం
వెనె్నలవేళ పెట్టిన వేడిముద్దు కదా తన పద్యం
గిజిగాడి తూగుటుయ్యాల ఇంటిలో దూరి... ఆడినా
సాలీడు గూటిలో తన్మయత్వపు పాట మైమరచి పాడినా
లోలోన ఆనందపడు నోరులేని శిశువు లాంటి యోగి అతడు
సింధు గంగానదీ జలక్షీరాన్ని తాగి భరత మాతకు మొక్కిన భక్తుడు
పూజారి లేనివేళ గర్భగుడిలో వేలాడే గబ్బిలంతో
ప్రభువుకి సందేశమంపి కనువిప్పు కలిగించు కవివరుడు
పిరదౌసిగా మారి పాలకుల పాపాలను కడిగేసిన సాహసి
బుద్ధుడు క్రీస్తు వివేకానంద గాంధీ మహనీయుల
ఘనత చాటిన కవన వాటికకి కాలం పెట్టిన కలం కాపరి
కారుణ్యం నిండిన కన్నీటిలో ముంచి తీసిన పద్యం
మనసులో చేరి మంటలు మండటం చూశాను
జాలి నింపుతూ జాలువారిన మాటల్లో
రగిలిన జ్వాలలు అంతరంగాన్ని తాకడం కన్నాను
ఇహ పరాలనేలిన నవయుగ కవితా చక్రవర్తి
పద్మభూషణుడు... ఎల్లలెరుగని విశ్వనరుడు
నిన్ను కన్నతల్లి లింగమాంబ గర్భంబు ధన్యంబు...
నిక్కమిది నమ్ము జాషువా సుకవీ!!

- గరిమెళ్ల నాగేశ్వరరావు, 9951573059