సాహితి

ఉషోదయాన్ని కాంక్షించే వేకువపిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకమ్

వేకువపిట్ట
ఎస్.ఆర్.్భల్లం
పుటలు: 82; వెల:రు.100/-
ప్రతులకు: భల్లం సామ్రాజ్యలక్ష్మి,
4-87-12, ఇందిరానగర్, గాంధీబొమ్మ సెంటర్,
తాడేపల్లిగూడెం- 534101.. ఫోను: 9885442642
విజయవాడ, విశాలాంధ్ర బుక్‌హౌస్, సాహితీ బుక్‌హౌస్,
నవోదయ పబ్లిషర్స్, శివకామేశ్వరీ గ్రంథమాల.

పాఠకుల ఎదుట సమాజ వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరించి, మెదళ్ళకు పట్టిన జడత్వాన్ని వదిలించి ఆలోచనాలోచనాలను తెరిపించేవాడే కవి. అలాటి అసలుసిసలు కవి ఎస్.ఆర్.్భల్లం. ప్రస్తుతం దేశం ముఖచిత్రం మారిపోయింది. ఇప్పుడు పల్లెలంటే పచ్చని పద చిత్రాలు కావు. గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసికొంటుంటే, తాళాలు వేసిన ఇళ్ళతో వలసపోయిన గీతాలు. దుఃఖ భరిత జీవితాలు. ఇక నగరాలు చూద్దామంటే నగరం నిండా యాంత్రికత నిండిన మనుషులు. పక్కన వుండే ఇరుగుపొరుగువారి పేర్లుకూడా పట్టించుకోని స్థితి. తెల్లారిన దగ్గరనుంచి అర్ధరాత్రి వరకు రూపాయి వెనక పరుగులెత్తే కరెన్సీ జీవులు.
బహుళజాతి సంస్థలు బడుగు దేశాలపై చేస్తున్న బహుముఖ దాడి, వారు ఉత్పత్తిచేస్తున్న వస్తువులను ప్రకటనల ద్వారా ప్రలోభపెట్టి అమ్ముకోవడం, కల్తీ విత్తనాలతో, కృత్రిమ ఎరువుల కొరతతో కర్షకుల దైన్యస్థితి, పల్లెలు ఒకప్పటి తమ నైసర్గిక స్వరూపాన్ని పోగొట్టుకోవడం అన్నీ కవిని కలవరపెట్టాయి. మానవ సంబంధాలకు మనిషి నానాటికి దూరమైపోతున్నాడే అన్న ఆవేదనకు అక్షర రూపమే ‘వేకువపిట్ట’ కవితా సంపుటి.
‘పల్లెవిత్తనం’ కవితలో ‘ఈత కొలనూ పూతరేకూ! గున్నమావీ గిలకబావీ! గుడ్డ ఊయలా బడి బంగళా! అన్నీ రంగురంగుల కరెన్సీ కంపే’’అని ఒకనాటి అమాయకత్వాన్ని, ఆత్మీయతను కోల్పోయి, ధాన్యం గింజల గాదెల బడులు కరెన్సీ నోట్లకట్టల పెట్టెలను ఆరాధించే పల్లెల గురించి వ్యాఖ్యానిస్తారు. ఒకప్పుడు అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే ప్రకృతిలో సహజమైనవన్నీ కొందరు డబ్బుగలవారికి మాత్రమే అందే స్థితిని వర్ణిస్తున్నారు. ఒకప్పుడు విదేశీ కంపెనీలు ఉత్పత్తిచేసిన బి.టి విత్తనాలు వాడి మన దేశ వాతావరణానికి సరిపడక, పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసికొన్నారు. దీనికంతటికీ కారణమైన బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం బార్లా తలుపులు తెరవడాన్ని ‘‘విత్తనంపై పెత్తనానికి/ విరుగుడు పురుగు ఇపుడపుడే పట్టదా!’’ అని తన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.
ఒకప్పుడు వైభవంగా బతికి ఇప్పుడు కనాకష్టంగా బతుకుతున్నవారు చేనేత పనివారు. ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టే ఆరుగజాల చీరలు నేసిన కళాకారులకు నిలయమైన దేశమిది. కానీ ఇప్పుడు అలాంటి కళాకారులు బ్రతుకంతా మగ్గంగుంటలో వుండి ఇంటిల్లిపాదీ పనిచేసినా నోట్లోకి నాలుగువేళ్ళు పోని దుస్థితి. దీనే్న ‘‘పేగు నిండని పోగు’’లో పోగుపోగునూ కలిపి నేసినా/ పేగు నింపని బతుకుబంధంలో/ చీకటి వెలుగుల పడుగూపేక దస్త్రానికి/ పేదరికమంత పెద్ద చిరుగు/’’అని నేత పనివారి బతుకు కన్నీటి చిత్రాలను చిత్రిస్తారు కవి. బహుళ జాతి సంస్థలు మామూలు మనుషుల జీవితాలను ఎంతో అధోగతిపాలు చేస్తున్నాయి. ప్రైవేటైజేన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఈ మూడు త్రిముఖ వ్యూహాలు మన సంస్కృతి మీద, మన సంపద మీద పెత్తనం చెలాయిస్తున్నాయి. మనమేం తినాలో వాళ్ళే చెప్తారు. మనమేం చూడాలో వాళ్ళేకానిస్తారు. మనమెలాంటి ఉద్యోగాలు చెయ్యాలో వాళ్ళే నిర్ణయిస్తారు. సజీవమైన అనుభూతులతో నిత్యనూతనంగా పరిమళించాల్సిన బతుకులను, కేవలం సరుకులుగా భావించడాన్ని సహించలేక కవి చేలూ మనవే చేతులూ మనవే/ చేతలే మనవి కావు/ కనుపాపా మనదే/ కనురెప్ప మనదే/ చూపులే మనవి కావు/’’ అంటూ బతుకు సరుకుగా మారినప్పుడే/ మనిషి కలలు ఎప్పుడో చిరిగిపోయాయి’’అని తన ఉక్రోషాన్ని వెలిగ్రక్కుతున్నారు. ఇరవై నాలుగ్గంటలు వార్తల్ని సేకరించి, పత్రికకు పంపే విలేఖరి గురించి ‘‘కత్తుల్నికూడా కొవ్వొత్తుల్ని చేసుకొన్నట్లు/ అతగాని వార్త/ ప్రపంచం చుట్టూ వేకువపిట్టై ఎగురుతుంది’’ అని వార్త గొప్పతనాన్ని వ్యాఖ్యానిస్తారు. ‘నాలో ఒకతె’లో పురషాధిక్యత నొకపక్క, స్ర్తిఔన్నత్యాన్ని ఒకపక్క పడుగుపేకలాగా అల్లుతారు. ‘‘ఒక్కొక్కటిగా దుస్తుల్ని వలుస్తూనే వుంటాను/నాలోని నిస్సిగ్గు కోరికలకు/ నిర్మలమైన నీ మనసును కప్పుకునే వుంటావు’’ అని స్ర్తిపురుష స్వభావాలకు అద్దంపడతారు. పురుషునికెప్పుడు శరీరంమీద కాంక్ష. స్ర్తికెపుడు స్వచ్ఛమైన మనసుమీద కోరిక. ఒక స్ర్తివాద కవిత ఇది.
ఇంద్రధనుస్సులో అనేక రంగులున్నట్లు, ఈ ‘వేకువ పిట్ట’నిండా విభిన్న కవితలు ఎన్నో. తన అక్షరాలను అవసరమైనచోట నిప్పుకణికల్లా, ఇంకొకచోట వెన్నముద్దల్లా, పూలగుత్తుల్లా సమయానికి తగినట్లు ప్రయోగిస్తారు. ‘‘చలి చెలికి వానమేనా పడుతున్న వేళా/ ఒళ్ళంతా చినుకుముద్దలతో పులకిస్తూ/ మర చెంబులో మిరియపు పాలు తాగుతుంటే/ మరేదో లోకంలో మనసు విహరించేది/’’ అంటూ ఒకప్పుడు అందరూ ఇష్టపడిన ‘మరచెంబు’ గురించి ఒకనాటి జ్ఞాపకాల వేణువును ఆలపిస్తూ మనలనుగూడా మరో లోకంలో విహరింపచేస్తారు భల్లంగారు.

- మందరపు హైమవతి, 9441062732