సాహితి
ఆఖరి శిరస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆకాశ కల్లోలిత ప్రాంతంలో
మేఘాలు వస్త్ర సన్యాసం చేసాయి
కురులు విప్పిన శిశిరం
నగ్నమానుల్ని కౌగలించుకుంటుంది.
అనేక రాత్రులన్నీ కలలుగా భావించబడ్డాయి
నిద్రలో అలలుగా భాగించబడ్డాయి
తారల తనువుల్లోంచి
పర్యాయ దేహాలు పుట్టుకొచ్చాయి
అవి కొన్ని కొత్త దాహాల్ని ఏరుకొచ్చాయి
నెలవంక ఆ నేల వంక చూసి
చిలిపిగా నవ్వుతుంది
చీకటి చెమటల్లో తడిసి ముద్దవుతున్న
తనువుల్ని చూస్తూ
విశ్వం కాల్పానిక నిజం
కాలం నిజాల కల్పన
దారులకు ఇరువైపులా ప్లాస్టిక్ పువ్వులు
అల్ట్రా వయొలెట్ కృత్రిమ ఇంద్రధనుస్సులు
చిక్కబడుతున్న రాత్రిలో
నూలు పోగులేని నవ్యత్వం
నాతి శిల్పాల్ని ధిక్కరిస్తుంది
సమస్త అంతర్దుఖాన్ని మింగి
పాలపుంతలన్నీ భగ్న యుద్ధాల్లో
కుచించుకుపోతూ
కాలబిలాలుగా కడపటి రాగాన్ని
అందుకున్నాయి
సమాంతర పర్వత శిఖరాలు ముగిసిన
‘‘నిన్నని నేడుగా ఉదయించడానికి
ఆఖరి శిరస్సు’’ వొంచాయి.