సాహితి

అనుభూతి రాగాలు.. పూలపిట్ట సోయగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూలపిట్ట: వెల:రు.100/-
పుటలు: 96, సోమిశెట్టి స్వర్ణలత
ప్రతులకు: సోమిశెట్టి నరసింహారావు,
ప్లాట్ నెం.1502, జి.బ్లాక్
సేథి మ్యాక్స్‌రాయల్, సెక్టార్- 76
నోయిడా- ఉత్తరప్రదేశ్
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

కవిత్వం ఎప్పుడూ ఆగక ప్రవహించే సజీవ నది. ప్రాచీన కాలంలో విద్య కవిత్వానికి పట్ట్భాషేకం చేసిన యుగంనుండి ఆధునిక వచన కవితా ప్రక్రియ వరకు ఎన్నో మలుపులు తిరిగింది. భావ కవిత్వం, అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్ర్తివాద, దళితవాద, ముస్లిం, మైనారిటీవాద ఉద్యమాలతో ఎప్పటికప్పుడు వస్తువులోను, రూపంలోను కొత్త మలుపులు తిరుగుతూనే వుంది. మినీ కవిత్వం కొన్నాళ్ళు ప్రాభవం పొందింది. ఆ తర్వాత నానీలు, రెక్కలు ప్రక్రియలు వచ్చాయి. వీటిలో భాగంగానే ఏకవాక్య కవితా ప్రక్రియ వచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్టేబర్గ్ ఆధారంగా తెలుగులో ఆచార్య ఫణీంద్ర ప్రవేశపెట్టిందే ఈ ఏకవాక్య కవితాప్రక్రియ. ఈ ప్రక్రియలో శ్రీ ఆర్.వి. ఎస్.ఎస్. శ్రీనివాస్‌గారు ప్రతిభావంతులుగా పేరుపొందారు. ఈ మార్గంలోనే సోమిశెట్టి స్వర్ణలతగారు రచించిన ఏకవాక్య కవితా సంపుటి ‘పూలపిట్ట’. ఈమె కవిత్వ రంగానికి కొత్తకాదు. అంతకుముందే శ్రీ స్వర్ణ కిరణాలు, జ్వలించిన రాగాలు మొదలగు కవితా సంపుటులు రచించిన ప్రసిద్ధ కవయిత్రి. నవ రసాల్లో శృంగారం ప్రముఖమైనది. పాఠక హృదయాలను పరవశింప చేస్తుంది. ఈ సంపుటిలోని కవితలలో అధిక భాగం కవితలు శృంగార రస భరితాలు. ప్రణయ భావలహరులు, వలపు తలపుల పరిమళాలు.
మన తెలుగువాళ్ళకి ఆషాఢ మాసం పట్టింపు లెక్కువ. కొత్తగా పెళ్ళయిన దంపతులు ఒకేచోట వుండరు. పెళ్ళికూతురు పుట్టింటికి వెళ్ళిపోతుంది. సతీపతులు విరహవేదనతో వేగిపోతారు. శ్రావణం వస్తే గానీ వారి కోరికలు తీరవు. అందుకే కవయిత్రి ‘‘శ్రావణం ముందే ముంగిట్లో వాలింది- నా విరహాన్ని చూడలేక’’ అని భార్యాభర్తల విరహ తాపానికి అక్షర రూపమిస్తారు. వర్షాకాలం వస్తే ఎక్కడ చూసినా నీళ్ళు జలజలా ప్రవహిస్తాయి. దీనే్న చమత్కారంగా ‘‘మేఘం పంపిన నీటి శాలువాని కప్పుకొని భూమి పులకరిస్తుంది’’ అంటారు. ప్రేయసికెప్పుడూ ప్రియుని మీద అంతులేని ఆరాధన. మేలుకొన్నా, కలల పల్లకీలో విహరిస్తున్నా, నిద్రా నావలో పయనిస్తున్నా ప్రియుని తలపుల్లో మునిగిపోతుంది. అతని వలపు అలల్లో తలమునకలౌతుంది. భక్తులు రామకోటిని రాసి తరించినట్లు ప్రేయసి ప్రియుని నామకోటి రాస్తుంది. దీనే్న చమత్కారంగా ‘‘నీ నామకోటి లిఖిస్తున్నా- నా జన్మ ధన్యమవాలని’’ అని అంటారు. ప్రేమ పరాకాష్ఠను వర్ణిస్తూ ‘‘మది పొరలు వేడి ఆవిర్లు కక్కుతున్నాయే- నీ తలపులు రాజుకున్నాయేమో’’ అంటారు. ఒకప్పుడు పెళ్ళంటే ఏడు జన్మల బంధమని, ఒకసారి పెళ్ళయితే ఆ బంధం చిరస్థాయిగా వుంటుందని అంటారు. కానీ ఇప్పుడు విడాకులు ఎక్కువ ఐపోయాయి. సాఫ్ట్‌వేర్ యుగంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దంపతులు విడిపోతున్నారు. శబ్దార్థాల్లా కలసి వుండాల్సిన జంటలు, అర్థంలేని శబ్దాల్లా మిగిలిపోతున్నారు. కట్నాలు ఇవ్వలేదని, కానుకలు ఇవ్వలేదని ఏడడుగులు జీవితాంతం కలసి నడుస్తానన్న భర్తే పెళ్ళయి మూడేళ్ళు కాకుండానే అపార్థాలతో విడాకులు ఇస్తున్నారు. డబ్బు జబ్బు ప్రవేశించిన ఈ కాలంలో ప్రేమలు లేక, ఇద్దరిమధ్య సదవగాహన లేక మూడుముళ్ళబంధాలు ముక్కచెక్కలవుతున్నాయి. పెళ్ళి చిరకాలం నిలవాలంటే ఒకరినొకరు అర్థం చేసికోవాలి. ఇద్దరిమధ్య ప్రేమ వుండాలి. అందుకే ‘‘వలపుదారంతో పేనుతున్నా పరిణయ సూత్రాన్ని పటిష్టంగా’’ అని పెళ్ళిలో ప్రేమ ప్రాముఖ్యాన్ని గురించి చెప్తారు.
జీవితమంటే కేవలం ప్రణయమే కాదు. అనేక సంఘర్షణలుంటాయి. సమాజంలోనూ ఎన్నో సమస్యలు. కవయిత్రి సమకాలీన సంక్షుభిత సమాజాన్ని విస్మరించలేదు. అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, చిన్నారి విద్యార్థుల పుస్తకాల భారాలు, సామ్రాజ్యవాద విష సంస్కృతీ ప్రభావాలు, అమెరికా పయనాలు, అమ్మా నాన్నలను చివరి దశలో చూడకపోవడం, వృద్ధాశ్రమాల్లో చేర్చడం ఇటువంటివన్నీ కవయిత్రి మనస్సును కలవరపెట్టాయి. అన్నిటిమీద కవితాస్త్రాలు సంధించారు.
ఈనాడు స్వచ్ఛ్భారత్ పేరు మారుమోగిపోతుంది. వీధుల్ని పరిశుభ్రంగా వుంచాలి. స్వచ్ఛ్భారతదేశాన్ని నిర్మించాలి అని ప్రధాని ఎలుగెత్తి చాటారు. ఇప్పుడు ఇది కేవలం నినాదప్రాయంగా మిగిలిపోయింది. వీధుల పరిస్థితి ఏమీ మారలేదని అంటారు. ఇవాళ వేసిన రోడ్లు రేపటికి గుంటలు పడిపోతాయి. వర్షమొస్తేచాలు వీధులన్నీ వైతరణీ నదులే. దీన్ని నిరసిస్తూ ‘‘స్వచ్ఛ్భారత్ పేరే మోగేది- వీధుల దుస్థితి కాదు మారేది’’ అంటారు. ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కరువైపోయిన నేటి రోజుల్లో, లాభం లేకపోతే కన్నతల్లిదండ్రుల్నే వృద్ధాశ్రమాల చిరునామాలకి పంపిస్తున్నారు. దీనే్న ‘‘వీలునామా నా పేరున వ్రాస్తావా- నిన్ను వృద్ధాశ్రమానికి పంపనులే’’ అని నేటి సమాజానికి చురకలు వేస్తున్నారు. ఈనాడు విద్యార్థులకు పుస్తకాల భారం మోయలేని పెనుభారం, పుస్తకాల సంచీ మోసే ఒక్కొక్క విద్యార్థి శిలువను మోసే క్రీస్తులా నడవలేక నడుస్తుంటాడు. ప్రతి సంవత్సరం మేధావులు విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గిస్తామంటారు. ప్రకటనలు చేస్తారు. కానీ ఆచరణలో శూన్యం. దీనే్న ‘‘చిన్నారుల కోరిక- ఈ ఏడాదైనా పుస్తకాల మోత తగ్గాలని’’ ఆకాంక్షిస్తారు. ‘పూలపిట్ట’లో చాలా కవితలు భావ కవితలు. ఐనా కవయిత్రి కేవలం భావ కవిత్వానికే పరిమితం కాలేదు. సునిశితమైన దృష్టితో సమాజాన్ని పరిశీలించి విభిన్న కోణాలు స్పృశిస్తూ సామాజికాంశాలతో పలు కవితలు రాసారు. కవయిత్రికి భాష మీద పట్టు వుంది. ఈ భావాన్ని శక్తివంతంగా వ్యక్తీకరించే నేర్పు వుంది. ఏదైనా ఎక్కువ వాక్యాల్లో చెప్పడం తేలిక గానీ, రసస్ఫోరకమైన అర్థవంతమైన ఒక వాక్యం రాసి పాఠకులను మెప్పించడం కష్టం. అలాంటి ప్రక్రియలో కృషిచేసి చక్కని కవితలు రాసిన కవయిత్రికి అభినందనలు.
- మందరపు హైమవతి,
9441062732