సాహితి

ఒక సంపూర్ణ జీవితానుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామా చంద్రవౌళి
‘ఒక ఏకాంత సమూహంలోకి...’ కవితా సంపుటి

రామా చంద్రవౌళి జగమెరిగిన కవి, కథకుడు, నవలా, నాటకకర్త, విమర్శకుడు. 300 కథలూ, 28 నవలలు, 9 (తెలుగు), 6 (ఇంగ్లీషు) కవిత్వ సంపుటాలు, మూడు విమర్శాగ్రంథాలు, రెండు నాటకాలూ రచించి, ప్రచురించిన అనుభవశాలి. పొందిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలూ, లభించిన విశిష్ట సందర్భాలూ మెండుగా ఉన్నాయి. ఈ ‘ఒక ఏకాంత సమూహంలోకి’- రామాచంద్రవౌళి పదవ కవితా సంపుటి. దీనిలో 31 కవితలు ఉన్నాయి. ఆధునికతనీ, వర్తమానాన్నీ సమాజాన్నీ మనిషినీ ఎంతగా ప్రేమిస్తాడో- సిసలైన కవిత్వాభివ్యక్తినీ అంతగా ప్రేమిస్తాడు రామాచంద్రవౌళి. తన వ్యక్తీకరణం నవం నవంగా నవ్యంగా ఉండాలనే వాంఛ ఆయనది. ‘కొమ్మపైకి పక్షి ఒకటి వచ్చి వాలినట్టు/ ఒక పుస్తకం... నా తలుపు దగ్గరి టీపాయ్ పైకి చేరుతుంది/ పుటల్లోపల ఒక సముద్రముంటుంది/ ఒక మనిషుంటాడు/ స్పర్శించగానే ఒక సంభాషణ షురూ’ అని కవితా వచనంతో మొదలై ‘అక్షరాలను తొడుక్కుని ఒక చరిత్ర ప్రవహిస్తూ వుంటుంది/ కాలం పాయలు పాయలుగా/ ప్రతి పుటలో నుండి/ ఇదివరకు తెలియనిదేదో/ కొత్త పరిమళం.. కొత్త ఆకాశం../ కొత్త గాలి/ తలుపులను తెరచుకుంటూ కొత్త కిటికీ/ కొత్త సంగీతం... కొత్త పాట... ఒక కొత్త ఉత్తేజం..’ అంటూ కవిత్వపు గాలి తెరలుగా సాగిసాగి చివరికి ‘నాకు సుస్తీచేసిన ప్రతిసారీ/ నా భార్య.. తల్లవుతుంది ఆత్మను స్పర్శిస్తూ../ పిడికెడు దయను దానం చేస్తూ/ పుస్తకాలేమో నేస్తాలై... ఔషధాలై... పునరావేశాలై/ మళ్లీమళ్లీ బ్రతికిస్తుంటాయి - అని ముగుస్తుంది. కవి అనుభూతి ప్రసరణంలోని గాఢతకీ, వాక్య నిర్మాణంలోని సాంద్రతకీ ఆనందం కలుగుతుంది.
కవిగా- మనకందరికీ తెలిసిన సామాజిక సందర్భాన్నో, సమస్యనో వస్తువుగా స్వీకరిస్తాడు రామాచంద్రవౌళి. అయితే, దాన్ని కవిత్వం చేయటంలో- తనదైన శైలినీ, శిల్పాన్నీ, రసవిద్యనీ ప్రయోగించి ఒక కళాకృతిని మనకందిస్తారు. ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ జరుగుతూనే ఉంటుంది..’ అని ఒక చరుపుతో మొదలై ‘జీవితం ఒక నది/ ఇరు తీరాలనూ ఒరుసుకుంటూ, కోసుకుంటూ ప్రవహిస్తుంది... తప్పదు’ అని ముగుస్తుంది- ‘ఒక నది..రెండు తీరాలు’ కవిత. మధ్యలో రాజీపడటాలు, సర్దుకుపోవటాలు, క్రమంగా నిశే్శషవ్వడం... ఇలా చాలా కథ! కవిత ముగిసేసరికే పఠిత ఒక ఆలోచనా కడలిలో మునకలు వేస్తూ వుంటాడు. రచనలో ఈ గుణ వైశిష్ట్యాన్ని ‘ఒడంబడికలూ... ఉల్లంఘనలూ..’ ‘ద్యూతసభ’ ‘అజ్ఞాత విధ్వంసం’వంటి ఎన్నో సామాజిక వాస్తవికతని ప్రతిబింబించే కవితల్లో చూస్తాము.
ఒక కథాత్మక ఇతివృత్తాన్ని లీనంచేసుకుని, సమయ సందర్భాల దృశ్యీకరణంతో- కవితని కథనం చేయటం రామాచంద్రవౌళి ఆత్మీయమైన విధానం. ‘అరణ్య రహస్యం’లోని గార్నెట్ లోయ... వుడ్స్ ఎడ్జ్‌గానీ, ‘చివరికి’లో అతను చనిపోయిన అమ్మానాన్నల జ్ఞాపకాల్ల చ్యిౄ జష్ద ఔ్ఘఒఆ నుండి ఔ్య్య ఔళఒళశఆలోకి యాంత్రించటంలో గానీ, ‘ఫేస్‌బుక్ గోకుడు’లో జరుగుతున్న సామాజిక సాంస్కృతిక విధ్వంసాన్ని గానీ- చదువుతున్నప్పుడు రామాచంద్రవౌళిలోని కథకుడు కవిత్వంలోని వొంపువాటాల్లోకి ప్రవహిస్తాడు.
‘జగత్ నృత్యం’, ‘స్వప్న రహస్యం’, ‘తాళంచెవి దొరకడం లేదు’, ‘పూల మస్తాన్’వంటి కవితల్లో కవికిగల- ప్రకృతి, ప్రేమ, సౌందర్యం, మానవీయ భావనల్లోని సత్యానే్వషణ పట్ల ఉత్సుకత ద్యోతకవౌతోంది. రామాచంద్రవౌళి కవిత్వధారలో ఆత్మాశ్రయ అభివ్యక్తి ఎక్కువ. ఉదాహరణకి ‘కవిత్వానికి లొంగనిది’ అనే ఖండికని చెప్పవచ్చు. ‘మాటల్లోకి ఒదగవు అన్నీ’ అని మొదలెట్టి మూర్త, అమూర్త, రూప, నైరూప్య చిత్రాల్ని ఆవిష్కరిస్తూ వెళ్లివెళ్లి కడకు ‘ఒంటరితనం కూడా కవిత్వానికి లొంగదు’ అని కొరడా ఝుళిపించి చదువరికి సంవేదనని పంచుతాడు. సమకాలీన వచన కవిత నిర్వచనబద్ధం కావటం అనివార్యంగా కనిపిస్తోంది. వర్ధమాన కవులేకాక అనుభవశాలురైన కవులూ ఈ ఒత్తిడికి లోనవుతున్నారు. తన అండమాన్ యాత్ర సందర్భంగా ‘హృదయపు లోతుల్లో ఉవ్వెత్తున లేచిన దుఃఖోద్వేగాన్నీ కవితామయం చేసి మనతో పంచుకున్నారు రామాచంద్రవౌళి. రామాచంద్రవౌళికి కావ్య జగత్తుకు సంబంధించిన సామగ్రి యావత్తూ కరతలామలకం. అందుకనే ఆయన కవిత్వంలోని శబ్దచిత్రాలూ, రూపకాలూ, ఉపమలూ, ఇతర అలంకార సౌందర్యం వంటివన్నీ ప్రత్యేక పరిశీలనాంశాలుగా మిగులుతాయి. ఒక్క మాటలో- ఈ ‘ఒక ఏకాంత సమూహంలోకి’ కవిత్వం ఒక ఉద్వేగ సాగరం! పఠనీయమైన, ఆలోచనీయమైన, మానసికారోగ్యకరమైన కవిత్వాన్ని వెలువరించిన రామాచంద్రవౌళి అభినందనీయులు!!

- విహారి, 9848025600