సాహితి

దీపశిఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలం ఎప్పుడూ శోకించదు
కవి స్ఫూర్తి వేదన భరించనపుడు
విషాద మేఘచ్ఛాయాలు క్రమ్మి
పరావర్తనం చెందినపుడు
భావస్ఫోరకమై సంచలిస్తూ
విచలితం జ్వలనమై
అశృతప్త కాసారమవుతుంది.
విరి తోటను విస్మరించిన విరజాజి
పరిమళాన్ని విదిల్చి వెళ్ళిపోయింది
నిన్నటి సంధ్యాసమయంలా
నిరుడు కురిసిన శ్రావణమేఘంలా
స్వర్ణమరుూ... సుకుమారీ...
కాంస్య తావి అబ్బలేదు నీకు
స్వాప్నిక జగతిలో జననీ జనకుల ఆశయం
సహారాలో చినుకు ఆశ నిరాశల ఆవిరి
భావితరానికి వైద్య శిఖామణి కావాలని
వాగ్దేవి అనుగ్రహించిన విషమ పరీక్షలో
తేలిపోయాననే భ్రమలోకంలో
అంతమొకటే పరిష్కృతమని
అనంతమనే యోచన లేని ఆవిర్భావం
హడలి వడలి గడగడ వణికిపోయి
ఆత్మహత్య భవిష్యద్దర్శనమని
ఎలా స్పందించినావో...
వైశాఖంలో ఉద్భవించిన ఓ వానకోయిలా
శ్రీవాణి ఒడిలో ఓలలాడే విద్యార్థీ
నీ సహచరుల మధ్య నిగ్రహించలేక
సమ సహకార సంప్రదింపులను మరచి
విద్యాలోకాన్ని శోకంలో ముంచెత్తి
గగనం కుసుమమై కడలిలో ఎగసిన కెరటమై
వౌన భాష్యానికి మరణ గీతికనయ్యావు.

- సయ్యద్ జహీర్ అహ్మద్ 9505152560