సాహితి

సామాజిక విలువలే సాహిత్య లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రతీయ సమాజంలో ఆధునిక యుగం - 1850 ప్రాంతాల్లో ప్రారంభమయింది. 1857లో తొలి స్వాతంత్య్ర సమరం జరిగింది. అందువల్ల, ఆధునికతకు 1857ని చారిత్రక చిహ్నంగా గుర్తుపెట్టుకోవచ్చు. గతంలో తుప్పు పట్టిన ఇనుప ముక్కలేకాదు, వెదికిపట్టుకుని పరిరక్షించుకోవాల్సిన వజ్రాలూ, రత్నాలూ కూడా ఉంటాయి- అన్న చారిత్రక వాస్తవాన్ని మన సమాజం స్వీకరించి, ఆచరిస్తుంది. అందువల్ల, ప్రాచీన యుగంలో సృష్టించబడ్డ విలువలు- వజ్రాలూ, రత్నాలూ- ఆధునిక యుగంలోకి ప్రవహించాయి. సాహిత్యం ఆ అనంత విలువలపట్ల నిరంతర చైతన్యం కలిగిస్తుంది.
ప్రతి యుగంలోనూ సమాజ నిర్మాతలు మంచి సమాజం కోసం మహోన్నత విలువలు సృష్టిస్తారు; వ్యవస్థీకృతం చేస్తారు. 1857 నుంచి 1947 వరకూ అంటే స్వాతంత్య్రం వచ్చే వరకూ ఈ 90 సంవత్సరాల కాలంలో సంఘ సంస్కర్తలూ, స్వాతంత్య్ర సమరయోధులూ జాతిని చైతన్యపరచి, బ్రిటీషు పాలననుంచి విముక్తి కోసం, చైతన్యవంతమైన సమాజ నిర్మాణం కోసం మహోన్నతమైన విలువలు సృష్టించారు, ఏర్పరిచారు. ఈ 90 సంవత్సరాల కాలం ఉద్యమ యుగంగా చారిత్రీకరింపబడింది. ఉద్యమ సందర్భంలో సమరయోధులూ, ప్రజలూ జాతికి ఎన్నో విలువలు- వజ్రాలూ, రత్నాలూ అందించారు. జాతీయత- దేశభక్తి- సంఘ సంస్కరణ శీలత- స్వాతంత్య్ర శీలత-స్వేచ్ఛాశీలత- త్యాగశీలత- నిర్మాణ శీలత- సాహసశీలత- సమైక్యశీలత- హింసాయుత ఉద్యమశీలత మున్నగు వజ్రాలూ, రత్నాలూ అందించారు. ఆ విలువలు ప్రజా జీవితంలో కొంతవరకూ వ్యవస్థీకృతం అయ్యాయి. బ్రిటీషు పాలన నుంచి విముక్తి- ప్రజా వ్యవస్థల నిర్మాణంలో ఈ విలువలు జాతి మరువజాలని చారిత్రక పాత్రను పోషించాయి. అవి ఉద్యమ కాలానికే పరిమితమైన విలువలు కాదు. రాజ్యం- ప్రజలు వ్యవస్థ ఉన్నంతకాలం ఆ విలువలు ఉంటాయి. జాతికి దిశానిర్దేశం చేస్తాయి. ప్రజల వైపునుంచి విముక్తి మరియు స్వేచ్ఛా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఆ విలువలు ప్రజల చేతుల్లో సాధనాలుగా ఉంటాయి. ప్రజల మనసుల్లో చైతన్యం పెల్లుబికేలా చేస్తాయి. మనకు స్వాతంత్య్రం వచ్చింది. ప్రజాస్వామ్యం పేరుకే వచ్చింది. నిజమైన స్వాతంత్య్రం కోసం, నిజమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఉద్యమించక తప్పదు, ఉద్యమిస్తారు. ఆధునిక యుగం 1857లో ప్రారంభమయింది. ఆధునిక సాహిత్యం 20వ శతాబ్దానికి కొద్దిగా ఇటూ అటూగా ప్రారంభమయింది. తొలి తరం ఆధునిక రచయితలు ఉద్యమ స్ఫూర్తితో సాహిత్య రచన చేశారు. అటు సంఘ సంస్కరణ- ఇటు స్వాతంత్య్ర సమరంలో ప్రజల్లో చైతన్యం రగుల్కొల్పారు. విలువలను వ్యవస్థీకృతం చేసే ప్రయత్నం చేశారు. భావితరాలకు ప్రవహింపజేశారు. చారిత్రక పాత్ర పోషించారు. సాహిత్య శక్తినీ, ప్రయోజనాన్నీ నిరూపించారు. వలస రాజ్య లక్షణాల నుంచి, రాచరిక రాజ్య వారసత్వ లక్షణాలనుంచి, నియంతృత్వ స్వభావంనుంచి మన ప్రజాస్వామ్యం విముక్తి కాలేకపోయింది. బ్రిటీషు పాలన కొనసాగినట్లే అయింది. అవే చట్టాలు, అవే రూల్స్, అదే రీతి పాలన, అదే అవినీతి, అదే దోపిడీ! రాజ్యాధికారం చేతులు మారినట్లే అయింది! ఒకవైపు వైజ్ఞానిక సమాజం కోసం - మరోవైపు నిజమైన ప్రజాస్వామ్యం కోసం ఏయే ప్రజా ఉద్యమాలు జరిగాయి. అవి ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోయాయి. బ్రిటీషు పాలన నుంచి నేర్చుకున్న అణచివేత ముఖ్య కారణమని చరిత్ర చెపుతుంది. అయితే- వైజ్ఞానిక సమాజం పట్ల- నిజమైన ప్రజాస్వామ్యం పట్ల- ప్రజల్లో చైతన్యం కలిగించడంలో, ఆ ఉద్యమాలు విజయవంతమయ్యాయి. ఆ ఉద్యమాల ప్రభావంలో అభ్యుదయ- ప్రగతిశీల- విప్లవ- ప్రజాస్వామ్య సాహిత్యోద్యమాలు కూడా వచ్చాయి. ప్రజల్లో చైతన్యం కలిగించడంలో సాహిత్య ఉద్యమాలు గొప్ప పాత్రను పోషించాయి ఆ ఉద్యమాల ప్రభావంలో మహోన్నతమైన విలువలు నిర్మింపబడ్డాయి. హేతుశీలత- వైజ్ఞానికశీలత- అభ్యుదయశీలత- ప్రగతిశీలత- విప్లవ శీలత- ప్రజాస్వామ్య శీలత వంటి విలువలు నిర్మింపబడ్డాయి.
సమాజాన్నీ- పరిణామాలను- ప్రజల మనోభావాలనూ పసిగట్టి, ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత సాహిత్యంపై ఉంది. 21వ శతాబ్దిలో మరో పరిణామం వేళ్ళూనుకుంటోంది. ప్రజలు అటు కార్మిక నియంతృత్వ ప్రజాస్వామ్యాన్ని కానీ, ఇటు పెట్టుబడిదారీ నియంతృత్వ ప్రజాస్వామ్యాన్ని కానీ కోరుకోవడంలేదు. ఏ నియంతృత్వం లేని నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు.
మరో వాస్తవాన్ని కూడా చెప్పుకోవాల్సి వుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడ్డాక- ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంత అప్రజాస్వామికంగా, ఎంత క్రూరంగా ఉంటున్నప్పటికీ- ప్రజలు సాయుధ పోరాటాలను విశ్వసించడం లేదు; కోరుకోవడంలేదు. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని సాయుధ ప్రజా పోరాటాల చరిత్రను పరిశోధిస్తే ఈ వాస్తవం తెలుస్తుంది.
నిజమైన ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే- మార్గాల్లోనే నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణం ప్రజలు కోరుకుంటున్నారు. సాహిత్యం ఆ దశలో పనికి పూనుకుంది.
మన ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఒకవైపు వలస రాజ్య లక్షణాల నుంచి, రాచరిక రాజ్య వారసత్వ లక్షణాలనుంచి, నియంతృత్వ స్వభావం నుంచి విముక్తి కాలేకపోయింది. మరోవైపు కొత్త తరం పెట్టుబడిదారీ వర్గం, మన రాజకీయ వ్యవస్థను వ్యాపార వ్యవస్థగా మార్చివేశారు. కోట్లమీద పెట్టుబడి పెట్టగలిగిన వాడే ప్రజా ప్రతినిధి కాగలడు- అన్న వ్యాపార వ్యవస్థలోకి వెళ్లిపోయింది. ఓటు- ప్రజాప్రతినిధి- కూడా వ్యాపార పదార్థాలుగా మారిపోయారు. వ్యాపార వ్యవస్థకీ- రాజకీయ వ్యాపార వ్యవస్థకీ- మధ్యనున్న గీత చెరిగిపోతుంది! అవినీతి- దోపిడీ వ్యవస్థను నడుపుతుంది! దీన్ని మనం నిజమైన ప్రజాస్వామ్యంగా పరిగణించగలమా? ప్రాచీన కాలం నుంచి నేటివరకూ వివిధ ఉద్యమాల్లో- పరిణామాల్లో- త్యాగశీల మేధావర్గం, ప్రజలు మంచి సమాజం కోసం మహోన్నత విలువలు నిర్మించారు. ఆ విలువల వెలుగులో- ఆ విలువలను ఉద్యమ పరికరాలుగా, ఉద్యమ మార్గాలుగా చేసుకుని, ప్రజలు నిజమైన వైజ్ఞానిక మరియు నిజమైన ప్రజాస్వామ్యం కోసం సమైక్యంగా ఉద్యమించాల్సి ఉంది. ఆ క్రమంలోనే మన వ్యవస్థ మృగ వ్యవస్థ స్వభావం నుంచి విముక్తి కాగలదు.
ప్రజాస్వామ్య మార్గాల్లో నిజమైన వైజ్ఞానిక సమాజ నిర్మాణం- ప్రజల ముందు, సాహిత్యం ముందూ ఉన్న గొప్ప లక్ష్యాలు. ఆ దిశలో ప్రజలూ, సాహిత్యం సమైక్యంగా ఉధృతంగా ఉద్యమించాల్సి ఉంది.

- జయంతి పాపారావు 8885421949