సాహితి

ఎప్పుడూ నువ్వేకదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సలు తోచనీయని సమయాలు
కొన్ని ఉంటాయి.
మాటే వినని మనసులుంటాయి

ఎక్కడో ఉన్న అమ్మని తలచే తలపులుంటాయి
కంటి కొలుకుల్లోంచి జారి పడని నీళ్ళుంటాయి
విలవిలలాడే ఆక్రోశాలుంటాయి

ఆకాశానికి నిచ్చెనలుంటాయి
అదిరిపడే ఉరుములుంటాయి
వర్షపాతంలా కష్టాలుంటాయి
వరదల్లా ఆశలుంటాయి
ఉబికి వచ్చే ఝడిలా నిశ్శబ్ద రాగాలుంటాయి
ఎనె్నన్నున్నా
ఒక్క సూర్యుడిలా
వెలుగై వచ్చే అనురాగం
నాకొక మేల్కొలుపు
తడి తళుకులొత్తిన నా కంటి మెరుపిప్పుడు
నువ్వేకదా
ఎప్పుడూ నువ్వేకదా!

- బులుసు సరోజినీదేవి, 9866190548