సాహితి

మనిషి జాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంధ్యాకాశం ప్రతిరోజూ
ఎరుపెక్కే ఎర్ర చందనం
చంద్రుడు అదనుకోసం వేచి పైనబడి పారిపోయే చైన్‌స్నాచర్

అప్పు పత్రాలపై రాయబడ్డ అక్షరాలు మెరిసే నక్షత్రాలు
ఈ నల్లని మబ్బులు
తరతరాల సిరాతో వేసిన వేలిముద్రలు

అప్పు తీర్చడానికి
ఊరు విడిచి వెళ్ళిన మనిషి
అడ్రసు ఆచూకి ఎవరికి తెలియదాయె

ఇక్కడ మూడేండ్ల పసివాడు
బోరుబావిలో పడి ప్రాణాలు విడిచాడు
ఏడేళ్ళ ఆడపిల్ల ఇటికలు మోస్తూ
పనిలోనికి చేరింది

నడుము వంచి నాట్లు వేసే
పొలం కూలీల్లో కుదిరింది
చేసిన కష్టం చేతికందదు,
కడుపు నిండదాయె
మంచానపడ్డ ముసలి అమ్మ కొడుకును
కలవరించడం మానదాయె
తిరిగి వస్తానన్న కన్నకొడుకు
కండ్లముందు కనిపించడాయె

కడుపు చేత పట్టుకొని పోయి
కడుపునే చేజారవిడుచుకునే
తెలివిలేని వాడు
బ్రతుకుదామని పోయి
బ్రతుకునే పోగొట్టుకున్న
వలస పోయిన వెర్రివాడు
కష్టకాలంలో కంటి తడిని తుడ్చేదెవ్వరు
ఆపద సమయంలో
ఎవరు తనవారై ఆదుకుంటారు
ఊరి పొలిమేర వైపు
ఎంతగా ఎదురుచూసినా బదులులేదు
ఆవహించిన నిశబ్దం
మనిషి జాడ తెలుపదాయె

- ప్రొ. లక్ష్మీనారాయణ, 9542656636