సాహితి

శిలను శిల్పంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమంటే
వెయ్యి పదాలను
వృధాగా వెదజల్లుటకాదు
ఒక్కో పదాన్ని ఏరీ
అందంగా కూరీ
దండగా పూరించడం
అక్షరమక్షరాన్నీ
అందంగా కాగితంపైకి
ఎక్కించడం
శిలను సుందర
శిల్పంగా చెక్కడం
***
జీవనది
అది నా మది
తెరచి వున్న గది
గలగలా పారేటి
జీవనది
జ్ఞానంతో నిండిన
అనంతమైన నిధి
అలుపన్నది లేకుండా
పనిచేయడం దాని విధి
ఎంత విజ్ఞానం దాచినా
దాని దాహం తీరనిది...

- శ్రీష్టి శేషగిరి 9290652632